అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో వివరిస్తూ.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ పబ్లిక్ కు అందుబాటులో ఉంది. అందులో సీబీఐ చెప్పిన చాలా విషయాల్లో ప్రజలకు క్లారిటీ ఉంది. అయితే ఏదో మిస్సయిందన్న భావన మాత్రం ఎక్కువ మందికి వస్తోంది. వివేకా హత్య జరగడానికి ముందు…తర్వాత చోటు చేసుకున్న కమ్యూనికేషన్.. ఫోన్ కాల్స్‌పై ఓ స్కెచ్ సీబీఐ వేసింది. అందులో అవినాష్ రెడ్డి అప్పట్లో చేసిన నవీన్, కృష్ణమోహన్ రెడ్డి అనే వ్యక్తుల ఫోన్ నెంబర్ల గురించి మాత్రం సీబీఐ ప్రశ్నించలేదు.
అవినాష్ రెడ్డి వివేకా హత్య జరిగిన తర్వాత హైదరాబాద్‌కు కాల్ చేశారు. హైదరాబాద్‌లోని జగన్ నివాసంలో పని చేసే నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు ఫోన్ చేశారు. ఆ విషయంపై సాంకేతిక ఆధారాలు ఉండటంతో వారిద్దరిని సీబీఐ పిలిచి ప్రశ్నించింది. కడపలో జరిగిన విచారణకు వీరిని సీఎస్ జవహర్ రెడ్డి తీసుకొచ్చి తీసుకెళ్లారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వారి ఫోన్లకు అవినాష్ రెడ్డి ఫోన్ చేసింది నిజమేనని.. వివేకా చనిపోయారని చెప్పేందుకు చేశారని అందులో తప్పేముందని సజ్జల కూడా మీడియా ముందు వాదించారు.
అంటే ఆ ఫోన్లను జగన్, భారతి మాట్లాడారని సజ్జల కూడా క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే సీబీఐ మాత్రం ఈ ఫోన్ కాల్స్ విషయాన్ని పక్కన పెట్టేసింది. అఫిడవిట్లో స్కెచ్‌ల రూపంలో చూపించిన దాంట్లో వీరి ఫోన్ కాల్స్ చూపించలేదు. దీనిపై కేసును ఫాలో అవుతున్న న్యాయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఇది అవినాష్ రెడ్డి బెయిల్ తిరస్కరించాలని దాఖలు చేసిన అఫిడవిట్ మాత్రమే కాబట్టి.. అదే అంశాలను హైలెట్ చేశారని.. అసలు విషయం వేరే చార్జిషీట్లలో ఉంటుందని మరికొంత మంది వాదిస్తున్నారు. అది నిజమో కాదో కానీ.. నవీన్, కృష్ణమోహన్ రెడ్డి కాల్స్ గురించి సీబీఐ చెప్పకపోవడం.. మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.