ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు సుప్రీంకోర్టులో మళ్లీ ముందుకు వచ్చింది. ఈ నెల తొమ్మిదో తేదీన విచాణరణకు లిస్ట్ అయింది. జస్టిస్ కే.ఎం జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో అమరావతి కేసును జూలై 11వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. వేసవి సెలవుల అనంతరం అమరావతి కేసు విచారణ చేస్తామని . ఈ కేసులో అత్యవసరం లేదని సుప్రీంకోర్టు అప్పట్లో తెలిపింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన జూలై 11న మొదటి కేసుగా విచారణ చేపట్టవచ్చని కోర్టు తెలిపింది.
అమరావతిని అన్ని మౌలిక వసతులతో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని కోర్టు మార్చి 3, 2022న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పులోని రెండు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. రాష్ట్ర శాసనసభ అధికారాలపై కోర్టు నిర్ణయం తీసుకోలేనందున ఏపీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
సుప్రీంకోర్టు ఈ కేసును స్వీకరించి ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా పడింది. పిటిషనర్లుగా ఉన్న కొందరు రైతులు ఏళ్ల తరబడి చనిపోయారని రైతుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చనిపోయిన రైతుల ప్రతినిధులను పిటిషనర్లుగా అనుమతించాలని కోర్టును కోరారు. . ఆ మేరకు రైతుల ప్రతినిధులకు నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులకు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రతీ సారి అమరావతి కేసును త్వరగా విచారించాలని ప్రభుత్వం మెన్షన్ చేస్తోంది. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేయడంతో మే 9వ తేదీన విచారణ చేపట్టాలని నిర్ణయించారు.