శంకుస్థాపన చేసేది మేమే.. కట్టేది మేమే అంటూ సీఎం జగన్ రెడ్డి వరుసగా చేసిన వాటికే శంకుస్థాపనలు చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. మీ బిడ్డను..మీ బిడ్డను అంటూ ప్రజలపై ఏదో ప్రేమ ఒలకబోస్తున్నట్లుగా నటిస్తున్నారు. నిజానికి ఆయనను బిడ్డగా భావించి కడప ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. వారికేం చేశారో తెలిస్తే .. ఆయన తల్లి, చెల్లి పట్ల ఎలా వ్యవహరించారో అలాగే వ్యవహరించారని అర్థం చేసుకోవచ్చు. దానికి సాక్ష్యమే అన్నమయ్య డ్యాంకు కొట్టుకుపోవడం..బాధితుల్ని ఆదుకోవడంలో ఇప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శించడం.
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడం.. ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడంతో అకస్మాత్‌గా వచ్చి పడిన వరదలకు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. గ్రామాలకు గ్రామాలే కాదు.. రోడ్లు వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. అవన్నీ అత్యవసరంగామళ్లీ నిర్మించాల్సిన…చేయాల్సిన పనులే. బాధితులకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి గాలికొదిలేశారు. ఇప్పటికీ బాధితులు స్వచ్చంద సంస్థలు ఇచ్చిన టార్పాలిన్ గుడిసెల్లో ఉంటున్నారు. రోడ్లు నిర్మించలేదు. రాజంపేట ప్రధాన వంతెన పూర్తి స్థాయిలో ధ్వంసం అయింది. వంతెన కింద నుంచి రాకపోకల కోసం రోడ్డు వేశారు. కానీ నదిలో నుంచి రోడ్డు ఎలా వేస్తారనే స్పృహ కూడా రాలేదు. వర్షాలుపడినప్పుడు ఆ రోడ్డు కొట్టుకుపోతోంది.
తమ బిడ్డ అధికారంలో ఉన్న ప్రభుత్వం వల్ల తాము సర్వం కోల్పోయామని అక్కడి ప్రజలుఉన్నారు. అయితే తమ బిడ్డ ఆదుకుంటాడని అనుకున్నారు. కానీ ఆ బిడ్డ సొంత తల్లి, చెల్లినే పట్టించుకోవడం లేదు.. ఇప్పుడు తమనేం పట్టించుకుంటారనే ఆవేదనలో ఉన్నారు. కానీ అదే బిడ్డ ఇప్పుడు రాష్ట్రమంతటా శంకుస్థాపన ఫలకాలు వేసుకుంటూ… బీభత్సమైన డైలాగులు చెబుతున్నారు. గూట్లో రాయితీయలేనోడు ఏట్లో ఎలా తీస్తాడని .. సొంత జిల్లా ప్రజల అనుకుంటే తప్పేముంది ?