కర్ణాటకలో తానే ముఖ్యమంత్రి అన్నట్లుగా నరేంద్రమోదీ ప్రచారం చేస్తున్నారు. శనివారం బెంగళూరులో ఆ మూల నుంచి ఈ మూలకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆయన కర్ణాటక ప్రచారం చీరు వైరల్ అవుతోంది. ఇంతగా ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. కర్ణాటకలో మోదీకి క్రేజ్ ఉందని ఎవరూ అనుకోరు. దక్షిణాదిలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. అది మోదీ బీజేపీలో ఎదగక ముందు నుంచీఉన్న పరిస్థితి. అక్కడ ఉన్న కులాలు, మతాల రాజకీయాల్లో బీజేపీ నేతలుఓ బలమైన వర్గంఓటు బ్యాంక్ సాధించారు. అప్పట్నుంచి బలంగానే ఉన్నారు.
కానీ ఇప్పుడు కర్ణాటకలో తానే సూపర్ స్టార్ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి బొమ్మై ప్రచారం గురించి ఎవరూ- పట్టించుకోడం లేదు. యడ్యూరప్ప తిరుగుతున్నా లెక్క చేయడం లేదు. కానీ అంతా మోదీ నామస్మరణ చేసేందుకు వెనుకాడటం లేదు. బీజేపీ సోషల్ మీడియా.. మీడియా మొత్తం మోదీ ..మోదీ అని అరుస్తూనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కర్ణాటకలో ప్రచారం చేసినాయన చేసిటన్లుగానే ఉన్నారు.
కర్ణాటకలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. అయితే మోదీ ప్రచారంతో మొత్తం మారిపోయిందని.. ఇప్పుడు సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఓ రకమైన ప్రచారం మొదలు పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరిపాలనను.. ఇలా మోడీ చేసే ఒకటి రెండు షోలతో అంతా మర్చిపోతారని అనుకోవడం అమాయకత్వమేనని ఎన్నికల పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కావాలనే మీడియా హైప్ క్రియేట్ చేసుకుని పరువు కాపాడుకుందామనుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.