తెలంగాణలో తొమ్మిదిన్నర వేల కోట్ల పెట్టుబడితో అమర్ రాజా పరిశ్రమ దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. గతంలో ఒప్పందాలు జరగ్గా ఈ రోజు పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమతో ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా చాలా మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అమరరాజా బ్యాటరీ పరిశ్రమ కోసం ఎనిమిది రాష్ట్రాలు పోటీ పడినా తెలంగాణలోనే ఏర్పాటు చేశారని కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు.
పూర్తిగా కాలుష్య రహిత పరిశ్రమ!
దివిటిపల్లిలో ఏర్పాటు చేసే పరిశ్రమ పూర్తి కాలుష్య రహితం. జీరో లిక్విడ్ డిశ్చార్జీతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. కంపెనీ కోసం ఎన్నో జిల్లాలు పోటీ పడినా… సీఎం కేసీఆర్ చొరవతో మహబూబ్ నగర్ కే ఈ అవకాశం వచ్చిందని చెుతున్నారు. తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుపై ఆనందంగా ఉందని గల్లా అరుణకుమారి అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వ అనుకూల విధానాలు ఉన్నాయని చెప్పారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో తమ కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మళ్లీ సొంత రాష్ర్టానికి వచ్చినట్లు ఫీల్ అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఏపీ నుంచి తరిమేసిన వైసీపీ !
అమరరాజా పరిశ్రమ వేరే రాష్ట్రానికి వెళ్లడం కాదు తామే దండం పెట్టి వెళ్లిపొమ్మని చెబుతున్నామని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధైర్యంగా ప్రకటించారు. అమరరాజా పరిశ్రమను.. చిత్తూరులో యువతకు ఉపాధి కల్పించడానికి.. గల్లా రామచంద్రనాయుడు అమెరికా నుంచి వచ్చి పెట్టారు. ఎక్కడికీ వెళ్లకుండా సొంత ప్రాంతంలోనే పరిశ్రమలు పెట్టారు. యువతకు ఉపాధి కల్పించారు. సొంత ప్రాంత ప్రజల అభివృద్ధికి సహకరించారు. అయితే రాజకీయ కారణాలతో జగన్ ప్రభుత్వం వేధించింది. కాలుష్యం పేరుతో తప్పుడు రిపోర్టులు సృష్టించి పరిశ్రమను మూత వేయించి.. తామే వెళ్లిపోవాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. వారు కోరుకుంటున్నట్లుగానే అమరరాజా పక్క రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఇప్పుడెవరికి నష్టం.
ఏపీ యవకకుపది వేల ఉద్యోగాలు లాస్ !
అమరరాజా తెలంగాణకు వెళ్లిపోవడం వల్ల జగన్ కు..వైసీపీకి..సజ్జలకు ఒక్క రూపాయి నష్టం లేదు. కానీ ఏపీ యువత పదివేల ఉద్యోగాలను కోల్పోయింది. ప్రభుత్వానికి టాక్సుల రూపంలో వచ్చే కోట్లాది రూపాయలు నష్టం జరుగుతుంది. అంతకు మించి పారిశ్రామికీకరణలో ఏపీ వెనుకబడిపోయింది. ఈ నష్టంఅంతా.. రాష్ట్రానికే. పాలకులు స్వార్థం కోసం.. రాజకీయం కోసం చేసిన పాపం ఇలా పగబడుతుంది. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకుంటారా ?