ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ జగన్ ఫ్యామిలీలో జరిగిన మరో సీక్రెట్ ను బయట పెట్టనున్నారు. ఈ వారాంతపు కొత్త పలుకులో జగన్మోహన్ రెడ్డి.. చెల్లి షర్మిలతో రాజీకి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఆయన సూచనలతో సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ వెళ్లి.. విజయమ్మతో సమావేశం అయ్యారని.. అక్కడ జగన్ చెప్పమన్నవి చెప్పారని అంటున్నారు. గతంలో జరిగిన చర్చల్లో షర్మిలకు ఇస్తామని కొన్ని కొన్ని ఆస్తుల విషయంలో జగన్ అంగీకరించినా ఇప్పటి వరకూ ఇవ్వలేదంటున్నారు ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇస్తాననే ప్రతిపాదన పెట్టారని చెబుతున్నారు.
అయితే వీటిపై విజయమ్మ లేదా షర్మిల ఎలా స్పందించారన్నది మాత్రం ఆర్కే చెప్పలేదు. డీటైల్డ్ ఆర్టికల్ లో దాని గురించి చెప్పవచ్చు. ఓటమి భయంతో జగన్.. తాను దూరం చేసుకున్న వారందర్నీ ఇప్పుడు దగ్గర చేసుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారని ఆర్కే చెబుతున్నారు. ఈ వారం జగన్ ఫ్యామిలీలో జరుగుతున్న మరో కొత్త విషయం బయట పెట్టాలనుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆస్తులు మాత్రమే కాదని.. వివేకా హత్య కేసు కూడా జగన్, షర్మిల మధ్య దూరం పెరగడానికి కారణం అన్న అనుమానాున్నాయి.
వైఎస్ జగన్ ఫ్యామిలీలో ఇన్ సైజ్ ఏం జరిగిందో ఆర్కే చెబుతున్నారు.గతంలో వైఎస్ వివేకా హత్య గురించి నలుగురికి జగన్ తెల్లవారు జామున నాలుగించే చెప్పారనిచెప్పారు. దానిపై వైసీపీ వాళ్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మామూలుగా అయితే బూతులతో విరుచుకుపడాలి. కానీ ఆర్కేను ఏమైనా అంటే మళ్లీ ఆయన ఏ విషయాలు బయటపెడతాడా అనే కంగారుతో అసలు నోరు మెదపడం లేదు.