భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ మీద ఉన్నారు. తన నాయకత్వంలో ఒక్క సీటు కూడా రాదంటున్నారని ఆరోపిస్తూ.. విశాఖ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు మెమో జారీ చేశారు. దీనిపై ఆయన సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారం ఏపీ బీజేపీలో అంతర్గత రచ్చకు కారణం అవుతోంది.
విష్ణుకుమార్ రాజు ఏబీఎన్ లో ఆర్కే కు ఇంటర్యూ ఇచ్చారు. ఓపెన్ హార్ట్ పేరుతో ప్రసారమయ్యే ఈ ఇంటర్యూలో విష్ణుకుమార్ రాజు బీజేపీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రోమో కట్ చేశారు. ఒక్క సీటూ రాదని తాను మోదీకే చెప్పానని విష్ణుకుమార్ రాజు చెప్పినట్లుగా ఆ ప్రోమో ఉంది. అయితే అది వచ్చే ఎన్నికల గురించి కాదు. గడిచిపోయిన ఎన్నికల గురించి. వచ్చే ఎన్నికల గురించి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో దీన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు అవమానంగా ఫీలయ్యారు. తాను పార్టీని నిలబెట్టి.. గెలిపించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తూంటే.. ఇప్పుడే ఒక్క సీటూ రాదంటారా అని ఆయన ఆవేదన చెందారు. వెంటనే మెమో జారీ చేశారు.
విష్ణుకుమార్ రాజు మొదటి నుంచి టీడీపీతో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు.అలా అయితేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఆయన భావన. బీజేపీ తరపున పోటీ చేస్తే.. డిపాజిట్లు రావని ఆయనకు అర్థం అయింది. అందుకే పొత్తు కావాలని పోరు పెడుతున్నారు. కానీ రాష్ట్ర నాయకుల తీరు వేరేగా ఉండటంతో టీడీపీలో చేరేందుకూ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కానీ.. టిక్కెట్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆర్కే లాంటి వారికి బీజేపపై వివాదాస్పద ఇంటర్యూలు ఇచ్చి.. గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారేమో కానీ.. సోము వీర్రాజు మాత్రం ముందే ఆయనను బయటకు పంపాలనే ఆలోచన చేస్తున్నారు.