ఏపీ జీవనాడిని ఏపీ ప్రభుత్వం నొక్కేసింది. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్ల పాటు పక్కన పడేసి ఇప్పుడు తమ వల్ల కాదని చేతులెత్తేసింది. కేంద్రానికి ఈ విషయం స్పష్టం చేసింది. సవరించిన అంచనాల ప్రకారం రూ. యాభై ఐదు వేల కోట్లు ఇస్తేనే నిర్మిస్తామని లేకపోతే నిర్మించలేమని లేఖ రాసింది. దీంతో ఇప్పుడు పోలవరం పని అయిపోయినట్లేనా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు శరవేగంగాపనులు జరిగాయి. జగన్ సీఎం అయ్యాక రివర్స్ టెండర్లు వేసి పనుల్ని పడుకోబెట్టేశారు. నిర్వహణ లేకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయి. అదే సమయంలో కేసుల కారణంగా ఆయన కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితికి చేరుకున్నారు. చివరికి కేంద్రం ఆయన నిస్సహాయతను అడ్డం పెట్టుకుని.. గతంలో అంగీకరించిన అంచనాలను దారుణంగా తగ్గిస్తూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తాము 55 వేలకోట్లకు అంచనాలను అంగీకరింప చేసశామని ప్రకటించుకున్నారు. తీరా కేంద్రం 2014 అంచనాల ప్రకారం ఇస్తామని చెప్పి పూర్తిగా నిధులను తగ్గించేసింది. కానీ రాష్ట్రం నోరెత్తలేకపోయింది.
ఇంత కాలం సైలెంట్ గా ఉండి..ఇప్పుడు పోలవరం .. తగ్గించిన అంచనాలతో నిర్మించలేమని కేంద్రానికి లేఖ రాసింది. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు కేంద్రం నిధులు ఇవ్వకపోతే నువ్వు నిర్మించలేవా చంద్రబాబూ అని.. జగన్ మైకుల్లో తెగ గోల చేసేవారు. ఇప్పుడు ఆయన వచ్చి తాను నిర్మించలేనని చెప్పడం.. వైసీపీ క్యాడర్ కూ తల కొట్టేసినట్లవుతుంది. అమరావతిని ఆపేయడం.. పోలవరం పడుకోబెట్టేయడం.. పరిశ్రమల్ని తరిమేయడం.. చూస్తూంటే.. ఏపీ ఉసురు తీయాలని ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందన్న సీరియస్ కామెంట్లు సెటైర్లుగా వినిపిస్తున్నాయి.