ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. విజయ్ అంటేనే సమ్‌థింగ్ స్పెషల్ కదా..? అందుకే వినూత్న ఆలోచన చేశాడు. ఈ వేసవి రోజుల్లో తన పుట్టిన రోజుని అందరూ చల్లచల్లగా జరుపుకోవాలనే ఆలోచనతో… ఐస్‌క్రీమ్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈరోజు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ విజయ్ అభిమానులు ఐస్‌క్రీమ్‌లను పంచి పెడుతున్నారు. అందుకు కావాల్సిన సరంజామా అంతా విజయ్‌నే పంపించాడు. గతంలోనూ విజయ్ పుట్టిన రోజున శీతల పానీయాలు, మజ్జిగ పంచాడు. కానీ.. అవి తెలుగు రాష్ట్రాలకే పరిమితం. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కదా? అందుకే దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. విజయ్ ప్రస్తుతం `ఖుషి` సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమా నుంచి ఓ పాట విడుదల కానుంది. విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్ డేట్ కూడా రానుంది. దిల్ రాజు బ్యానర్లో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విశేషాలు కూడా ఈరోజు తెలుస్తాయి.