దేశంలో గత కొంత కాలంగా హాట్ టాపిక్‌గా మారుతున్న యాపిల్ ఫోన్ల తయారీ యూనిట్ బెంగళూరుకు తరలిపోయినట్లుగా కనిపిస్తోంది. గతంలో తెలంగాణకు వచ్చిన ఫాక్స్ కాన్ చైర్మన్ తెలంగాణ సర్కార్ తో ఎంవోయూ చేసుకున్నారు. కొంగర కలాన్ వద్ద 250 ఎకరాలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. గత నెల 24వ తేదీన కూడా.. హైదరాబాద్ శివారులోని కొంగర కలాన్‌లోని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్ఐఐసి) పార్క్‌లో సుమారు 186 ఎకరాలను రూ.196 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆ కొనుగోలు ప్రక్రియపై ఎలాంటి అడుగు ముందుకు పడలేదు.
హఠాత్తుగా కర్ణాటకలో బెంగళూరు ఎయిర్ పోర్టుకు సమీపంలో దేవనహళ్లి దగ్గర మూడు వంద ఎకరాలు అనుబంధ సంస్థ ద్వారా కొనగోలు చేసినట్లుగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు ఫాక్స్ కాన్ తెలిపింది. అక్కడే యాపిల్ ఫోన్ల అసెంబ్లింగ్ చేసే అవకాశం ఉంది. అయితే బెంగళూరులో ల్యాండ్ కొనుగోలు చేసిన అనుబంధ కంపెనీ పేరు ఫాక్స్ కాన్ హాన్ హాయ్ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్మెంట్ కంపెనీ ఈ స్థలం కొనుగోలు చేసింది.
అయితే హైదరాబాద్‌లో స్థలం కొనుగోలు చేయాలనుకున్న అనుబంధ కంపెన ీపేవరు. ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎఫ్ఐటి), దాని పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ చాంగ్ యి ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని ప్రతిపాదించారు. అంటే బెంగళూరు ప్లాంట్ తో పాటు హైదరాబాద్‌లోనూ పరిశ్రమ పెట్టాలనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. అయితే బెంగళూరు ల్యాండ్ డీల్ బయటకు తెలియకుండా పూర్తి చేసేసిన కంపెనీ హైదరాబాద్ విషయంలో మాత్రం పెద్దగా స్పందించలేదు. హైదరాబాద్‌లో ల్యాండ్ తీసుకుంటారా లేదా.. ప్లాంట్ పెడతారా లేదా అన్నది కంపెనీనే ప్రకటించాల్సి ఉంది.