ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాని అనుగుణంగా తీసుకున్న ఒక్క నిర్ణయం గురించి ఎవరైనా చెప్పలగరా ? ఒక్కటంటే ఒక్కటీ ఉండదు. అన్నీ తప్పుడు జీవోలే. ఫేక్ పాలనే. కీలకమైన రాజధాని దగ్గర నుంచి అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలంటే విపక్షాల్ని అంతం చేయాలనుకునేందుకు కూడా అధికారాన్ని ఉపయోగించుకోవాలనుకోవడం వరకూ మొత్తం పరిపాలన ఓ ఫేక్. ఒక్క జీవో న్యాయపరీక్షలో నిలబడలేదు. ఇంత దారుణంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వానికి పరిపాలించే అర్హత ఉందా ?
రాజ్యాంగ విరుద్ధమంటూ కొన్ని వందల జీవోలు కొట్టివేత
ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా ఏర్పడింది. రాజ్యాంగ పరిధి మేరకు పాలన చేయాలి. 151 సీట్లు వచ్చాయని ప్రత్యర్థుల్ని మట్టుబెట్టేయడానికి.. రాష్ట్ర సంపదను అమ్ముకోవడానికి.. దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్లుగా కాదు. కానీ ఘనత వహించిన ప్రభుత్వాధినేత అదే అనుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా చేస్తున్నారు . కోర్టుల చేతుల్లో ఎన్ని కుక్క కాట్లకు చెప్పు దెబ్బలు తిన్నారో లెక్కలేదు. అయినా మార్పే లేదు. కనీస నైతిక బాధ్యత ఉన్న సీఎం అయితే ఎప్పుడో సిగ్గుపడి రాజీనామా చేసి ఉండేవారు. అసలు జీవోలన్నీ సీక్రెట్ గా ఉంచుతున్నారు. అవన్నీ బయటకు వస్తే ఎన్ని అక్రమాలు బయటపడతాయో అంచనా వేయడం కష్టం.
ఒక్క పథకంలో అయినా నిజాయితీ ఉందా ? అంతా ఫేకే !
స్కీముల పేరుతో పేదలకు డబ్బులు పంచుతున్నామని జగన్ చెబుతున్నారు. లక్షల కోట్లు పంచామని చెబుతున్నారు. కానీ అంతా ఫేకే. రైతు భరోసానే తీసుకుంటే.. ఏడాదికి పన్నెండున్నర వేలు అందరు రైతులకు ఇస్తామన్నారు. చివరికి ఏడున్నర వేలు చేశారు. అందులోనూ కులాన్ని చూశారు. ఏ పథకంలోనూ లబ్దిదారులు పూర్తిగా లేరు. ఒక్కో నియోజకవర్గానికి వంద, రెండు వందలు కూడా ఉండరు. చివరికి విదేశీ విద్య పేరుతో తీసుకొచ్చిన పథకంలోనూ టాప్ 50 యూనివర్శిటీల్లో చేరిన వారికే ఇస్తామని జీవో ఇచ్చారు. అంటే ఒక్క లబ్దిదారు అయినా ఉంటారా ? ఇంతకన్నా ఫేక్ పథకాలు ఎక్కడైనా ఉంటాయా ?.
అధికార దుర్వినియోగం – దోపిడి – బడాయి !
ప్రజల సొమ్మును సొంత ఆస్తిగా ఖర్చు పెట్టుకునే సీఎం జగన్ ఒక్కరే . వ్యక్తిగత పర్యటనలకు విలాసవంతమైన విమానాలు.. పది కిలోమీటర్ల దూరానికి హెలికాఫ్టర్లు.. ఎక్కడ చూసినా పార్టీ రంగులు.. ప్రకృతి విధ్వంసానికి పాల్పడి భవనాలు కట్టుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అసలు ప్రజాస్వామ్య పాలకుడా లేకపోతే.. నియంతనా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. ప్రభుత్వం నుంచి జగన్ కంపెనీలకు అధికారికంగా ఎన్ని వేల కోట్లు వెళ్లాయో చెప్పడం కష్టం. మద్యం, ఇసుకల్లో క్యాష్ రూపంలో ఎలా దోచుకుంటున్నారో కళ్ల ముందే ఉంది. అది చాలదన్నట్లుగా ఆయ్యగారు రోడ్డు మీదకు వస్తే పరదాలు.. చెట్లు కొట్టేయడం.డివైడర్లు కూడా లేపేయడం. ఈ డాబు చూసి ఖర్మ అనకోని జనం లేరు.
కొసమెరుపేమిటంటే ఆయన ఎప్పుడైనా బయటకు వస్తే.. పట్టుబట్టి ఒకరిని గుర్తించి పిలిచి మరీ సాయం చేస్తారు. అదీ ఫేకే. ముందుగా యాక్టింగ్ రిహార్సల్ చేసి వచ్చి మరీ ఈ సాయం చేస్తారు. ఇలాంటి ఫేక్ పాలనతో ఎంత కాలం నెట్టుకొస్తారు.. ఎంత మందిని మోసం చేస్తారు ?