సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు టిక్కెట్ ఇస్తారో లేదో తెలియదు కానీ.. పవన్ కల్యాణ్, టీడీపీతో జత కట్టడం వల్ల ఎత్తిపోతాయనుకుంటున్న సీట్లలో తనకు ఉండదని తనకు తాను సర్ది చెప్పుకుంటున్నారు. కాపులంతా పవన్ వెంట లేరని.. తన నియోజవకర్గంలో మాత్రం తన వెంటే ఉన్నారని ఆయన చెబుతున్నారు. కాపు కులంలో ఉన్న వారంతా తమ కులానికి చెందని వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలని ఆశించారని, అయితే పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు పని చేస్తున్నారని చెప్పకొస్తున్నారు.
పవన్ ను బలపరిస్తే ఇవాళ కాకపోతే రేపైనా సీఎం రేసులోకి వస్తారని ఇప్పుడు ఆయనను బలహీనపరిస్తే.. వైసీపీలో సీఎం పదవి ఇస్తారా అన్న సెటైర్లు జనసైనికులు వేస్తున్నారు. ముందు జుట్టుకు రంగేసుకుని జగన్ ముందుకు వెళ్లేంత స్వేచ్చ తెచ్చుకోవాలనిసలహా ఇస్తున్నారు. తన గురించి.. తన నియోజకవర్గంలోని కాపులు ఎక్కడికీ పోరని తన వెంటనే ఉంటారని చెప్పుకుంటున్న అంబటి మాటల్లోనే.. అసలు భయం అంతా బయటపడుతోందని చెబుతున్నారు.
అదే సమయంలో కాపులకు తాను ఎన్నిసార్లు చెప్పినా అర్దం కావటం లేదని అంబటి వాపోతున్నారు. కాపులు.. ఎవరినో సీఎం చేయడానికన్నా తమ జీవితాల్ని బాగు చేసే వారికి మద్దతిస్తారనే విషయాన్ని అంబటి రాంబాబు మర్చిపోతున్నారు. జగన్ ఊడిగంచేసినా కాపు రిజర్వేషన్లు తొలగించినా ఒక్క మాట మాట్లాడని రాంబాబుకు కాపు వర్గంఎలా మద్దతిస్తుందో ఆయనే ఆలోచించకోవాలన్న సెటైర్లుపడుతున్నాయి. నిజానికి కాపు వర్గాన్ని తిట్టడంవల్లనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారన్న ప్రచారం ఉంది. తన కులాన్ని తిట్టుకుని మంత్రి పదవిని సంపాదించిన ఆయన ఇప్పుడు తన కులం అండగాఉండాలని కోరుకుంటున్నారు. అయితే అసలు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది కూడా ఇంకా క్లారిటీ రాలేదు.