ఏపీలో పొత్తులపై బీజేపీ నేతలు తమ వాయిస్‌లో మార్పు తెచ్చుకుంటున్నారు. జనసేనతో పొత్తులో ఉన్నాం.. టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదనను పవన్‌కల్యాణ్ తీసుకువచ్చారు విశాఖలో జీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు. పవన్ ప్రతిపాదనను పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లామని… పొత్తులపై అంతిమ నిర్ణయం కేంద్ర నాయకత్వమే తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ జీవీఎల్ నరసింహారావు ప్రకటనలు వేరుగా ఉండేవి. తాము జనసేనతో కలిసి మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెప్పేవారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా .. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాతమని.. చెబుతున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగలడం.. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోటీ చేయాల్సి వస్తే.. నోటాను దాటడం కూడా కష్టమని వారికి తెలుసు. టీడీపీని బ్లాక్ మెయిల్ చేసి అత్యధిక సీట్లు సంపాదించాలన్న ఉద్దేశంతోనే వారు ఇప్పటి వరకూ పొత్తులంటే ఇష్టం లేదని.. టీడీపీ ఉందని.. అదని..ఇదని చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో వైసీపీతో లోపాయికారీ వ్యవహారాలతో కాలం గడుపుతున్నారు. ఇప్పుడు వారిలోనూ మార్పు కనిపిస్తోంది.
అయితే ఇప్పుడు టీడీపీ పొత్తులు పెట్టుకోవాలంటే చాలా రూల్స్ పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి అందే అడ్డగోలు సహకారాన్ని ఆపిన తర్వాతే పొత్తుల గురించి మాట్లాడాలని.. అప్పుడే నైతికత, నిజాయితీ ఉంటాయని సంకేతాలు ఇచ్చే చాన్స్ ఉంది. ఓ వైపు జగన్ కు సహకరిస్తూ ఉంటే.. మరో వైపు పొత్తులు అంటే ఎలా అని అచ్చెన్నాయుడు ఇంతకుముందే ప్రకటించారు. ఆయన మాటల్లోనే.. బీజేపీ తో కలిసి పని చేస్తాం కానీ షరతులు వర్తిస్తాయని చెప్పకనే చెబుతున్నారు.