చేతిలో అధికారం ఉంది కదా అని సీఐడీతో అడ్డగోలు కేసులు పెట్టించడం రాత్రికి రాత్రి అరెస్టులు చేయిండం.. కసి తీర్చుకోవడం తర్వాత ఆ కేసుల్ని పక్కన పడేయడం కామన్ గా మారిపోయింది. ఒక్కటంటే ఒక్క సాక్ష్యం ఉండదు.నాలుగేళ్లుగా కొన్ని వందల కేసులు పెట్టారు. వందల మందిని అర్థరాత్రి ఇళ్లపై పడి.. తలుపులు పగులగొట్టి మరీ అరెస్ట్ చేశారు. మరి ఒక్కటంటే ఒక్క కేసులోనూ ఎందుకు చార్జిషీట్ వేయలేకపోయారు. రూపాయి అవినీతిపై సాక్ష్యాలను ఎందుకు ప్రవేశ పెట్టలేకపోయారు ?
చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను జప్తు చేసి సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసును ఇన్ సైడర్ ట్రేడింగ్ నుంచి క్విడ్ ప్రో కో అని కొత్తగా మార్చి కేసులు పెట్టి.. మళ్లీ కొత్తగా నిజాయితీ నిరూపించుకో అని సవాల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి పేర్ని నాని సేమ్ డైలాగ్ కొట్టారు. స్టేలు ఎందుకు తెచ్చుకుంటావ్.. విచారణ పూర్తయితే నిందితులెవరో తెలుస్తుందని గొప్ప సెటైర్లే వేశారు. కింది కోర్టు.. పైకోర్టు..సుప్రీంకోర్టు అనే తేడా లేకుండా.. తమకు వ్యతిరేకంగా ఎవరు దర్యాప్తు చేసినా అదంతా కక్ష సాధింపేనంటూ విచారణ జరగకుండా కోర్టులకు వెళ్లేది జగన్ అండ్ కో. చివరికితప్పుడు కేసుల నిందలు.. స్టేలు ఏమీ లేకపోయినా నిందించేది చంద్రబాబు బృందాన్ని.
సిట్ పై స్టే ఎత్తి వేసినా చేయడానికి ఏమీ లేదు. గతంలో అన్నింటిపై అంశాల వారీగా కేసులు పెట్టారు. ఒక్క దాన్నీ నిరూపించలేదు. అసలు ఇన్ రింగ్ రోడ్డు అనేదే లేదు. అలైన్ మెంట్ మార్చడమేంటో .. అందులో కేసు పెట్టాలనుకోవడం ఏమిటో వాళ్లకే తెలియాలి. మళ్లీ ఇందులో క్విడ్ ప్రో కో. కోర్టు చేత ఎన్ని దెబ్బలు తిన్నారో చెప్పాల్సిన పని లేదు.. కానీ ఇలాంటి నంగనాచి కబుర్లు మాత్రం వైసీపీ నేతలు చెబుతున్నారు. అధికారం ఉంది కాబట్టి.. సాక్ష్యాలు లేకపోియనా ఏదోఓ కేసు పెడితే.. వాళ్ల ఇబ్బంది వాళ్లు పడతారు.. మనం అయితే చేయాల్సిన దుష్ప్రచారాన్ని చేయవచ్చన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉంది.
నాలుగేళ్లుగా ఏం చేయలేకపోయారు.. ఈ ఏడాదిలో ఏమీ చేయకపోతే… తర్వాత పవర్ ఉండదని డిసైడయ్యారేమో కానీ.. సైకోతనం అంతా బయటపెట్టుకుంటారని.. టీడీపీ నేతలు అంటున్నారు. అన్ని కేసులు పెట్టి ఒక్క శిక్ష వేయలేదని.. అలాంటి కేసులు పెట్టిన అధికారులు… అరెస్ట్ చేసిన వారు.. దీని వెనుక కుట్రదారులందరికీ సరైన ట్రీట్ మెంట్ ఉంటుంందని హెచ్చరికలు చేస్తున్నారు.