కావలిలో ఓ బీజేపీ నాయకుడి తలను కాళ్ల సందులో పెట్టుకుని నలిపేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఆ ఫోటో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అది నిజమైన ఫోటో కాదేమోనని చాలా మంది డౌట్ కూడా వ్యక్తం చేశారు.కానీ దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. పోలీసుల దౌర్జన్యం చాలా స్పష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీ నేతలపై విరుచుకుపడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వారాంతాల్లో విశాఖలో వాలుతున్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడి.. కావలి పోలీసులపై సాయంత్రంలోపు చర్యలు తీసుకోకపోతే ఊరుకునేది లేదన్నారు . డీఎస్పీని సస్పెండ్ చేయకపోతే.. తాము ఏం చేస్తామో చూపిస్తామన్నారు. అసలు జీవీఎల్ ప్రకటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు. పట్టించకోలేదు. మరి ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు ఏం చేస్తారో చూడాలి.
బీజేపీలో ఉన్న నేతల్లో వైసీపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్న వారిలో జీవీఎల్ పేరు ముందు గా చెబుతూంటారు.ఆయన వైసీపీకి డెడ్ లైన్ పెట్టడం.. ఎవరూ పట్టించుకోకపోవడం పెద్ద విషయం కాదని..ఇదందా పొలిటికల్ గేమ్ అని బీజేపీలోనే కొంత మంది నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అసలు సీఎం జగన్ ను కంట్రోల్ చేయాలంటే.. బీజేపీకి పెద్ద పనా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ వారి అలుసును ఆసరాగా తీసుకుని వైసీపీ చేయాలనుకున్నది చేస్తుంది.