విశాఖలో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్త హయగ్రీవ ఇన్ఫ్రా పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు సహజమే. కానీ ఈ హయగ్రీవ సంస్థ.. అధికార పార్టీ నేతలకు బినామీగా మారిపోయిందని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. వృద్ధాశ్రమం కడతామంటూ తీసుకున్న అత్యంత విలువైన స్థలంలో వృద్ధాశ్రమం కట్టకపోగా.. భారీ విల్లా ప్రాజెక్టులు కడుతున్నారు. అదంతా వైసీపీ నేత పరం అయింది. దానిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నాయి. ఈ కంపెనీని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి .
ఇప్పుడు ఐటీ అధికారుు హాయగ్రీవ ఇన్ఫ్రాటెక్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎంవీపీ కాలనీలోని కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వందల కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. హాయ గ్రీవ మెనిజింగ్ డైరక్టర్ జగదిశ్వరుడు, పున్నం నారాయణ రావు, రాధరాణి చిలుకూరీ, అడిషనల్ డెరైక్టర్ నారాయణ శ్రీనివాస్ మూర్తీ, ఇంద్ర కుమార్ చితూరి , నారాయణ రావు గున్నం ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు జరుగుతున్నాయి.
విశాఖలోని ఎండాడ కొండపై సర్వే నెంబరు 92/3లో గల 12 ఎకరాలను 2008లో హయగ్రీవ సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి ఎకరా రూ.45 లక్షలకు కొన్నారు. వయోవృద్ధులకు హౌసింగ్ ప్రాజెక్టు కోసమని తక్కువకు కొనుగోలు చేసి మూడేళ్లలో ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉండగా నిర్మాణాలు చేపట్టలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది ఆ పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇదంతా విజయసాయిరెడ్డి కనుస్లోల జరిగిందని చెబుతున్నారు. ఇప్పుడు ఐటీ సోదాలకు కారణం విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య ఏర్పడిన వివాదాలేనన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.