పవన్ – సాయిధరమ్ తేజ్‌ల మల్టీస్టారర్‌కి ‘బ్రో’ అనే టైటిల్ పెట్టనున్నారని తెలుగు 360 ముందే హింట్ ఇచ్చింది. చివరికి అదే ఖరారైంది. అయితే.. ఈలోగా చాలా ప్రచారాలు సాగాయి. ‘బ్రో’ అనే టైటిల్ .. పవన్ ఫ్యాన్స్‌కి నచ్చలేదని, ఇదేం టైటిల్ అని పెదవి విరుస్తున్నారని వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో కూడా కాస్త నెగిటివిటీ కనిపించింది. అయితే ఈ విషయాల్ని చిత్రబృందం అస్సలు పట్టించుకోలేదు. బ్రో అనే టైటిల్ చాలా క్యాచీగా ఉందని భావించి.. అదే ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ సెట్ అవుతుందా? లేదా? అనే అనుమానాలు ఎవరికైనా ఉంటే… ఈ రోజు మోషన్ పోస్టర్ చూశాక అవన్నీ క్లియర్ అయిపోయాయి. పైగా పోషన్ పోస్టర్‌కి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. టైటిల్ ప్రకటించిన వెంటనే.. జనంలోకి వెళ్లిపోయింది. ఈ సినిమాకి సంబంధించినంత వరకూ పవన్ వర్క్ ఎప్పుడో పూర్తయిపోయింది. మరో 10 రోజులు షూటింగ్ చేస్తే చాలు. సినిమా రెడీ అయిపోతుంది. బ్రో నుంచి.. అతి త్వరలో ఓ చిన్న గ్లిమ్స్ రానుంది. ఇందులో పవన్ పాత్రని త్రివిక్రమ్ పదునైన మాటల్లో పరిచయం చేయనున్నారు. ‘బ్రో’ అనే పదానికి ఈ గ్లిమ్స్‌లోనే ఓ నిర్వచనం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అంతకంటే ముందు సాయిధరమ్ తేజ్ లుక్‌ని సైతం వదలడానికి చిత్రబృందం రెడీ అయ్యింది.