అమరావతిని నిర్వీర్యం చేద్దామన్న ఉద్దేశంలో ఎక్కడెక్కడి వారిలో సెంటు స్థలాలను రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. ఆవేశంలో చేయకూడని తప్పు చేసేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో రాజధానిలో స్థలాలని చెప్పింది. రాజధానిలో పేదలకు చోటు లేదా అని వాదిందించింది. ఇదంతా రికార్డెడ్. ఈ కారణంగానే న్యాయస్థానాలు స్థలాల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోబోమన్నాయి. మరి రేపు రాజధాని అంశంపై ఏమని వాదిస్తారు ?
అమరావతి అంశంపై హైకోర్టు తర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. వచ్చే జూలైలో విచారణ జరగాల్సి ఉంది. ఆ లోపే స్థలాల పంపిణీ పేరుతో ప్రభుత్వం హడావుడి.. రైతులకు పరోక్షంగా అయినా ముందే శుభవార్త చెప్పింది. అమరావతే రాజధాని అని ప్రభత్వమే అత్యున్నత న్యాయస్థానం ముందు స్పష్టం చేసింది. రేపు జరగబోయే విచారణలో అమరావతే రాజధాని అయినప్పుడు తీర్పులో అభ్యంతరాలేమిటి అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వం ఏం చెబుతుంది ? మూడు రాజధానులు చేసుకుంటామని చెబుతుందా ?. రాజధానిలో అందరూ ఉండాలని పేదలకు రైతులు ఇచ్చిన భూములు ఇచ్చి ఇప్పుడు మళ్లీ రాజధాని విశాఖ అంటే.. అక్కడ భూములు కేటాయిస్తారా ? అనే మౌలికమైన ప్రశ్న సహజంగానే వస్తుంది.
అమరావతి కూడా రాజధానే అంటే చట్టప్రకారం చెల్లదు. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం రాజధాని అమరావతిగా నిర్దారించారు. ఒప్పందం చేసుకున్నారు. దాన్ని అమలు చేయాలి. లేకపోతే ప్రభుత్వం ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు ద్రోహం చేసినట్లే. అ కేసు విచారణలో ఉండగానే మరోసారి పేదల పేరుతో మరోసారి ద్రోహం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ కావడమే అసలు విషయం. మొత్తంగా పేదల ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం చేసిన వాదనలు.. అంతిమంగా ప్రభుత్వ వాదనకు వ్యతిరేకంగా.. అమరావతి రాజధానికి మద్దతుగా ఉన్నాయి. వారికి గట్టి షాక్ తగిలేలా చేయడానికి ఇదొక కారణం కాబోతోందని న్యాయనిపుణులు చెబుతున్నారు.