దర్శకుడు శివ నిర్వాణ మంచి రచయిత కూడా. ఆయన కథలకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ స్వయంగా రాసుకుంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ కోసం గేయ రచయిత కూడా మారారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఈ సినిమా నుంచి ‘నారోజా నువ్వే నా దిల్ సే నువ్వే’.. అంటూ సాగే పాట ఇటివలే విడుదల చేశారు.ఈ పాటని స్వయంగా శివ నిర్వాణ రాశారు.
మరో విశేషం ఏమిటంటే… ఈ సినిమాలో అన్నీ పాటలని ఆయనే రాశారని తెలిసింది. సమంత అనారోగ్యం కారణంగా కొంత విరామం వచ్చింది. దిన్ని సమయాన్ని పాటలు రాయడానికి వాడుకున్నారు శివ నిర్వాణ. ఇప్పటికే విడుదలైన పాటకు మిశ్రమ స్పందన వచ్చింది. మణిరత్నం సినిమా పేర్లన్ని వాడుతూ రాసిన పాటని కొందరు మెచ్చుకుంటే మరికొందరు ఒరిజినాలిటీ లేదని పెదవి విరిచారు. మరి ఆల్బంలోని పాటలన్నీ శివనే రాశారు. ఇది ఆయనకు అదనపు భారమే. మరి మిగతా పాటల్లో ఆయన రచనా కౌశలం ఎలా వుంటుందో చూడాలి.