ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ సైతం విడుద లచేశారు. సముద్రం ఒడ్డున, చేతిలో ఆయుధంతో వీరోచితంగా ఎవరి కోసమో ఎదురు చూస్తున్న ‘దేవర’గా ఎన్టీఆర్ లుక్ రివీల్ చేశారు. ఈ లుక్ చాలా పవర్ ఫుల్గా ఉంది. లుక్తో పాటుగా రిలీజ్ డేట్ కూడా ఖరారు చేశారు. వచ్చే యేడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. మరో కథానాయికకీ కథలో చోటుంది. ఆమె ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.
* టైటిల్ త్యాగం చేసిన బండ్ల గణేష్
ఎన్టీఆర్ సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన నేపథ్యంలో ట్విట్టర్లో బండ్ల గణేష్ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. ఈ టైటిల్ తనదే అని, రెన్యువల్ చేయించుకోవడం మర్చిపోవడం వల్ల కొట్టేశారని వ్యాఖ్యానించాడు. అయితే ఆ తరవాత ఈ టైటిల్ ఎన్టీఆర్ కే వెళ్లిందని, ఎన్టీఆర్ కూడా తన హీరోనే కాబట్టి ఫర్వాలేదని మరో ట్విట్ చేశాడు గణేష్.