రూ. రెండు వేల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించిన తర్వాత చాలా మంది రాజకీయనేతలు తమ పార్టీల స్టాండ్‌కు తగ్గట్లుగా ప్రకటనలు ఇచ్చారు. ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. అయితే సామాన్యులు మత్రం.. రూ. రెండు వేల నోటా.. అదెక్కడుంది ?. ఎప్పుడో ఆపేశారుగా అనే అభిప్రాయమే వినిపించారు. ఎందుకంటే రెండు వేల నోట సర్క్యూలేషన్ ఆగిపోయి చాలా కాలం అయింది. ఎక్కడో ఒకటీ, అరా కనిపించాయి కానీ కొంతకాలంగా అదీ లే్దు. ఎంతపెద్దం లావాదేవీలు అయిన ఐదువందల నోట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆర్బీఐ చాలా కాలమే రెండు వేల నోట్లను ప్రింట్ చేయడం మానేసింది. బ్యాంకులు కూడా చాలా వరకూ వాటిని కస్టమర్లకు నగదు రూపంలో ఇవ్వడం తగ్గించేశాయి. ఈ ఉపసంహరణ అనేది ఇప్పుడే కాదని.. చాలా కాలం నుంచి జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అధికారికంగా తీసుకున్నారు. దీంతో గందరగోలం ఏర్పడదు. అదే సమయంలో నగదు రూపంలో బ్లాక్ మనీ దాచుకున్న వారికి ఈ నిర్ణయం షాక్ ఇవ్వడం ఖాయమేనతని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగం, రాజకీయ నేతలు, ప్రభుత్వాల్లో భారీగా లంచాలు వచ్చే పొజిషన్లలో ఉన్న వారి దగ్గర రూ. రెండు వేల నోట్లు పోగుపడి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక్కో ఓటుకు ఒక నోటు పంపిణీ చేయడానికి అధికార పార్టీలు ప్రణాళికలు రెడీ చేసుకున్నాయన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఈ క్రమంలో అలాంటి బ్లాక్ మనీ పోగేసుకుని ఉన్న పార్టీలకు ఎదురుదెబ్బ తగిలినట్లే. అయితే ఇలాంటి సిట్యూటేషన్లను ఎలా డీల్ చేయాలో వారికి గత నోట్ల రద్దు సమయంలోనే క్లారిటీ వచ్చింది కాబట్టి.. కాస్త నష్టం జరిగినా చెలామణిలోకి తెచ్చుకుంటారని భావిస్తున్నారు.
అయితే కేంద్రం, ఆర్బీఐ సీరియస్ గా ఉంటే.. బయటకు వచ్చే బ్లాక్ మనీ మూలాలంటే కనిపెట్టడం పెద్ద విషయం కాదు. నగదు లావాదేవీలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ్నుంచే బ్లక్ మనీ వస్తుంది. ఆ మూలాలు లాగితే.. చాలా మంది జాతకాలు వెలుగులోకి వస్తాయి. దీన్ని కేంద్రం పట్టించుకుంటందా అన్నది ఇప్పుడు కీలకం .