తెలంగాణ బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని క్లారిటీ వచ్చేసింది. ఆ పార్టీలో కొత్తగా చేరిన నేతలు ఎవరూ సంతృప్తిగా లేరు. బండి సంజయ్ మొత్తం డామినేట్ చేస్తున్నారని ఎవరికీ అవకాశాలు లేకుండా చేస్తున్నారని అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఎదగలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని వాటిలో బండి సంజయ్ ఒకటని.. ఆయనను తక్షణమే తొలగించాలని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు.
ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేశారు. బండి సంజయ్ ను కూడా హైకమాండ్ పిలిపించింది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది. బీజేపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై తాము కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పకనే చెప్పారు. బండి సంజయ్ ను తప్పించి ఈటల రాజేందర్ ను నియమిస్తే కొత్త నేతలు శాటిస్ ఫై అవుతారు. కానీ పాత నేతలు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఉంటాయి.
బీజేపీలో పరిస్థితిని రేవంత్ రెడ్డి చాలా పక్కాగా పట్టుకున్నారు. ఆందుకే ఆయన పేర్లు పెట్టి మరీ పిలిచి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. పరిస్థితి చూస్తూంటే.కేసీఆర్ ను ఓడించేందుకు అందరం కలిసి… కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నామనే ప్రకటన చేయడానికి సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. అదే జరిగితే బీజేపీ గాలి బుడగ పేలిపోతుందన్న సెటైర్లు పడుతున్నాయి.