ఏపీ సీఎం జగన్మోహన్ తన పాలన పాదర్శకంగా ఉంటుందంటారు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా అర్థరాత్రి ఉంటుంది. జీవోలను బయటకు రాకుండా పనులు పూర్తి చేస్తారు. ఇదేం పారదర్శకతరా అబ్బాయి అని ఎవరైనా ప్రశ్నిస్తేనే పాలనలో పాదరసంలా చురుకుగా ఉండటానికి తప్పలేదంటారు. చివరికి అసలు జీవోలనే ప్రజలకు అందుబాటులో ఉండొద్దని ఉత్తర్వులు జారీ చేసేశారు. ఆ జీవోల్లో ఎన్నెన్ని రాష్ట్ర ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టేసినవి ఉన్నాయో..ఎన్నెన్ని అమ్మేశారో … ఎన్ని ఆస్తులు తమ పేర రాసుకుంటూ ఇచ్చినవి ఉన్నాయో అంచనా వేయడం కష్టం.
అయితే ఇది చట్ట విరుద్ధం. కానీ ప్రభుత్వం.. న్యాయస్థానాల్లోనూ ఎలా వాదించాలో బాగా ఒంటబట్టించుకుంది. జీవోలను వెబ్ సైట్ లో పెట్టాలంటూ దాఖలైన పిటిషన్లు చట్ట విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సుదీర్ఘంగా జరిగేలా చూసుకుంటోంది. విచారణకు వచ్చినప్పుడల్లా .. కంటి తుడుపుగా కొన్ని జీవోలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి.. కోర్టు ముందుకు వెళ్లి అప్ లోడ్ చేస్తున్నాంగా అని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రభుత్వం నుంచి అలాంటి ఆదేశాలే వచ్చాయని మీడియాకు సమాచారం ఇచ్చారు. జీవోలన్నీ వెబ్ సైట్ లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందట.
అసలు జీవోలను వెబ్ సైట్ లో పెట్టకపోవడం సమాచార హక్కు చట్టం కింద నేరం. ఇప్పుడు పెట్టాలని చెప్పడం గొప్ప అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. హైకోర్టు ఎలా స్పందించినా.. మొట్టికాయ వేసినా.. ఈ ప్రభుత్వ పెద్దలకు బిందాస్. ఎందుకంటే అవన్నీ ఎప్పుడో వదిలేశారు. మనం అన్యాయం చేయాలనుకున్నవాళ్లకు చేశామా లేదా.. మనం చేయాలనుకున్న దోపిడీ చేశామా లేదా అన్నదే ముఖ్యం. మిగతా అంతా తర్వాత.. తుడిచేసుకుని వెళ్లిపోవడం కామన్. ఇప్పుడు కూడా అంతే. కోర్టులో విచరాణ జరిగిన తర్వాత ఒక్క జీవో కూడా అప్ లోడ్ కాదు. వాళ్లకు అవసరమైనవి తప్ప.