హైదరాబదా్, బెంగళూరు ఎక్కడైనా అరెస్ట్ చేయడానికి సీబీఐకి ఎక్కువ బలం ఉంటుంది కానీ ఏపీలో అయితే.. స్థానిక పోలీసుల మద్దతు తనకే ఉంటుందన్న ఉద్దేశంతో అవినాష్ రెడ్డి ఏపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలకే చెందిన కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో తల్లిని చికిత్స కోసం చేర్పించిన అవినాష్ రెడ్డి తాను కూడా లోపలే ఉండిపోయారు. ఆ చుట్టుపక్కల మీడియాను రానివ్వడం లేదు. పులివెదుల నుంచి వచ్చిన అవినాష్ అనుచురులు విశ్వభారతి ఆస్పత్రిని..ఓ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నట్లుగా మార్చేశారు.
మరో వైపు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి మరో నోటీసు జారీ చేశారు. 22వ తేదీన ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి దగ్గరకు చేరే అవకాశం ఇప్పుడు సీబీఐ అధికారులకు లేదు. ఆయనను కర్నూలు వరకూ వెంబడించిన సీబీఐ అధికారులు నిన్ననే పరిస్థితుల్ని గమనించి కర్నూలు నుంచి వెళ్లిపోయారు. ఉన్నతాధికారుల్ని సంప్రదించి ఏం చేయాలా అని చర్చించి.. చివరికి మరో చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
తల్లికి అనారోగ్యమని చెప్పినందున మరో చాన్స్ ఇవ్వడం మంచిదని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే అవినాష్ రెడ్డి మాత్రం సీబీఐ విచారణకు హాజరవడానికి ఏ మాత్రం సుముఖంగా లేరు. అరెస్ట్ చేయరు అనే హామీ ఇస్తే మాత్రమే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ న్యాయపరంగా అన్ని అవకాశాలు ఇప్పటికే మూసుకుపోయాయి. సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పటికైనా చేస్తుంది. కానీ ఎందుకో ఆలోచిస్తోంది. నోటీసులు ఇస్తోంది. వెళ్తే అరెస్ట్ చేస్తారనే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడం లేదు. తనకూ అనారోగ్యం అని అదే ఆస్పత్రిలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
ఒక వేళ అరెస్ట్ చేయడానికి వస్తే సీబీఐ అధికారులకు స్థానిక పోలీసుల సహకారం లభించదు. స్థానిక పోలీసుల సాయం చేయకండా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేరు. ఈ వ్యవహాన్ని కొంత కాలం కంటిన్యూ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.