బీజేపీతో టీడీపీ పొత్తులో ఉంది. కేంద్రంలో ఆ పార్టీ మంత్రులు ఉన్నారు. కానీ నిధులు మహా ప్రభో అంటే.. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. దేశభద్రతకు కేటాయించిన నిధులు ఇవ్వాలా అని వెటకారం చేశారు. కానీ అప్పటి నిధులు ఇప్పుడు జగన్ సర్కార్ కు ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో లోటును భర్తీ చేయాలని విభజన చట్టంలో ఉంది. ఆ మేరకు .. లోటు భర్తీ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కేలేదు. చివరికి విసుగొచ్చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. కానీ ఇవ్వలేదు.
ఇప్పుడు జగన్ రెడ్డి సర్కార్ కు ఆ నిధులన్నీ ఇస్తోంది. దాదాపుగా రూ. పది వేల కోట్లకుపైగా లోటు భర్తీ నిధులు రాష్ట్రానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం పండగ చేసుకోనుంది. ఈ ఏడాది మీట నొక్కాల్సిన పథకాలు.. రైతు భరోసా, అమ్మఒడి వంటి వాటికి ఆ నిధులు సరిపోతాయి. అంతేనా.. ప్రతీ వారం రూ. రెండు వేల కోట్లు అప్పులకు కేంద్రం పర్మిషన్ ఇస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం.. బటన్ నొక్కే కష్టాలు తీరిపోయినట్లే.
ఈ పరిస్థితి చూస్తూంటే.. పూర్తిగా వైసీపీతోనే ఉండిపోవాని బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా క్లారిటీ వస్తోంది. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం దివాలా తీయిస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని..ఎప్పటికైనా మారుతుందని జనసేన చీఫ్ అనుకుంటున్నారు. కానీ అప్పులే కాదు..గతంలో ఇవ్వాల్సిన నిధులు కూడా ఇప్పుడు ఇస్తూ..జగన్ సర్కార్ కు మేలు చేస్తోంది. ఎలా చూసినా ఇక బీజేపీని నమ్ముకోవడం అంటే.. దండగ అన్న అభిప్రాయానికి అందరూ వస్తున్నారు . మరి టీడీపీ, జనసేన కూడా ఇలాంటి అభిప్రాయానికి వస్తాయో రావో !