అప్పుల పాలైన వ్యక్తి తక్షణ ఉపశమనం కోసం అత్యంత విలువైన వస్తువుల్ని పదో పరక్కో అమ్మకమో..తాకట్టు పెట్టడమో చేస్తూంటారు. ఇలా ఎలా చేస్తావురా అయ్యా..అని ఇంట్లో కుటుంబసభ్యులు నిలదీసినా ఆ అప్పుల అప్పారావు పట్టించుకోడు. ఎందుదుకంటే.. తక్షణం కొంత నగదు కావాలి.. కొంత ఒత్తిడి తగ్గాలి.. రేపటి సంగతి ఎవరికి అవసరం అన్న మనస్థత్వం ఉంటుంది. అచ్చంగా ఏపీ ప్రభుత్వం కూడా ఇదే చేస్తోంది. అప్పుల ఊబిలో మునిగిపోయి.. ఏం చేయాలో తెలియని స్థితిలో.. ఏపీ భవిష్యత్ ను తాకట్టు పెట్టి కేంద్రం వద్ద నుంచి రూ. పది వేల కోట్లను తెచ్చుకుంది.
కేంద్రం నుంచి ఇక ఏ నిధులూ అడగబోమని రాసిచ్చిన ప్రభుత్వం !
లోటు భర్తీ కింద కేంద్రం రూ. పది వేల కోట్ల నిధులు ఇచ్చిన విషయం గుప్తంగానే ఉంది.. హఠాత్తుాగ బయటకు వచ్చింది. అసలు ఎందుకు ఇచ్చారో అన్నది ఒక రోజు తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇక రాష్ట్రంలో ఎలాంటి కేంద్ర ప్రాజెక్టులు, పథకాలకు నిధులు అడగబోమని రాసిచ్చి మరీ కేంద్రం నుంచి ఈ రూ. పది వేల కోట్లను జగన్ సర్కార్ తీసుకు వచ్చింది. ఇంత కంటే రాష్ట్ర ద్రోహం ఏమి ఉంటుంది ? రాష్ట్ర ప్రయోజనాలు మొత్తాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టి ఈ పది వేల కోట్లను తెచ్చుకున్నట్లయింది. కేంద్రం నుంచి రాజ్యాంగబద్దంగా రావాల్సిన నిధులను కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద తెచ్చుకున్నట్లుగా ఈ వ్యవహారం ఉండటం ఆర్థిక వర్గాల్లోనూ సంచలనం రేపుతోంది.
పోలవరం సహా ఇక ఏ ప్రాజెక్టుకీ కేంద్ర నిధులు రానట్లే !
పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఇక నిధులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టును పడకేశారు. రాజధానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వరు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు ఇవ్వరు. ఎలా చూసినా మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు రాజ్యాంగపరంగా రావాల్సిన వాటిపై కూడా హక్కులను వదులుకున్నట్లే. ఇంత కన్నా రాష్ట్ర ప్రజలకు చేసే ద్రోహం ఏముంటుంది ?
తాత్కలిక ప్రయోజనాల కోసం ఇంత ద్రోహం చేస్తారా ?
రాజకీయాలు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. రాష్ట్రం శాశ్వతం. కానీ దుర్బుద్ది రాజకీయ నాయకుని చేతిలో రాష్ట్రం సర్వనాశనం అయిపోతోంది. ఇప్పటికే వచ్చే పాతికేళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి కొంత బటన్లు నొక్కారు. మిగతా మొత్తం ఏమయిందో తేలాల్సి ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. పరిశ్రమలు లేవు. అంతకు ముంచి ప్రజలకు ఉపాధి లేదు. చివరికి చదువుకోవడానికి కూడా వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదేం పరిపాలన ?