రామ్ చరణ్ కు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ వుంది. ‘ఖైదీ నం.150’, సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ లాంటి చిత్రాలు ఈ సంస్థ నిర్మించింది. ఇప్పుడు మరో నిర్మాణ సంస్థకు శ్రీకారం చుట్టారు చరణ్. తన స్నేహితుడు విక్రమ్‌తో కలిసి తాజాగా మరో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ విక్రమ్, రామ్ చరణ్ మంచి స్నేహితులు.
వీరిద్దరూ కలిసి ఇప్పుడు ‘వీ మెగా పిక్చర్స్’ పేరుతో కొత్త బ్యానర్‌ను ప్రారంభించారు.‘వీ మెగా పిక్చర్స్’ బ్యానర్‌పై తీయనున్న చిత్రాల్లో కొత్త నటీనటులకు, యంగ్ టాలెంటెడ్ ని ప్రోత్సహించనున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ కథలతో పాన్ ఇండియా లెవల్ లో కంటెంట్ ని ప్రోడ్యుస్ చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి.