కేంద్రం ఇటీవల దేశ వ్యాప్తంగా ఎనిమిది కొత్త నగర నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అందు కోసం రాష్ట్రాల దగ్గర నుంచి ప్రతిపాదనలు పంపింది. అన్ని పంపాయి. ఏపీ ప్రభుత్వం కూడా పంపింది. ఏపీ ప్రభుత్వం ఎక్కడ కొత్త నగర నిర్మాణం చేయాలని పంపిందే… కడప జిల్లా కొప్పర్తి దగ్గర. కొప్పర్తి దగ్గర పారిశ్రామిక వాడ పేరుతో హడావుడి చేసి పెద్ద ఎత్తున భుముల్ని అస్మదీయులకు కట్టబెట్టారు. ఒక్క పరిశ్రమ నిర్మాణం కావడం లేదు. కానీ ఇప్పుడు అక్కడ కేంద్రం నిర్మించే నగరాల జాబితాలోకి ఎక్కించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపింది.
అమరావతి అనే ఓ నగర నిర్మాణం ఏపీ ప్రభుత్వం ఉంది. అమరావతిని నిర్మించే ఒప్పందంతో రైతుల వద్ద తీసుకున్న భూములు ఉన్నాయి. కేంద్రం నుంచి ఏ మాత్రం సహకారం అందినా భారీ నగర నిర్మాణం సులువుగా అయిపోతుంది. అలాంటి అవకాశాన్ని పక్కన పెట్టేశారు.కానీ అమరావతి భూముల్ని మాత్రం అడ్డగోలుగా పంచి పెడుతున్నారు. అమరావతి పీక నొక్కాలని పాలకుడు డిసైడయ్యాడు. నాలుగేళ్లుగా నొక్కుతూనే ఉన్నారు. అమరావతి ఉంటుందా ఊడుతుందా అనేది కోర్టులో ఉంది.. కానీ రాయలసీమలో బాగా వెనుకబడిపోయిన కర్నూలు వంటి ప్రాంతాల్లో కొత్త సిటీకి ప్రతిపాదనలు పంపవచ్చు కదా.. మూడు రాజధానుల్లో ఒక దానిగా డెవలప్ చేస్తామని ప్రచారం చేశారు. కానీ అక్కడ మాత్రం మౌలిక సదుపాయాల అభివృద్దికి మాత్రం పైసా కేటాయించడం లేదు.
రాజధానిలో హైకోర్టు పెట్టినా పెట్టకపోయినా.. బెంచ్ అయితే ఎవరైనా పెట్టవచ్చు. అలాంటి ప్రయత్నం చేసి..కొత్త సిటీ కోసం.. కర్నూలు ప్రతిపాదనలు పంపి ఉంటే క్ంద్రం కూడా.. ఎక్కడ కన్సిడర్ చేసి ఉండేది. కానీ ఇక్కడ అలాంటి ప్రయత్నాలే చేయడం లేదు. ఎంత సేపు ఏ పరిశ్రమ వచ్చినా పులివెందులకే..అదీ కూడా ఫేక్ పరిశ్రమలు. చివరికి ఏదైనా సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నా కడపకే. ఇంత మాత్రం దానికి రాష్ట్రమంతటికి సీఎం అని చెప్పుకోవడం ఎందుకో మరి