రానా, తేజ కలయికలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా వచ్చింది. ఇప్పుడు రానా తమ్ముడు అభిరాంని పరిచయం చేస్తూ అహింస సినిమా చేస్తున్నారు. దిని తర్వాత రానాతో మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఖరారైయింది. చీరాలలో జరిగిన అహింస ప్రీరిలీజ్ ఈవెంట్లో తేజ, రానా సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘రాక్షస రాజు’ అని పేరు పెట్టారు.
ఇదే వేడుకలో అభిరామ్ ని పరిచయం చేయడం వెనుక వున్న కారణం చెప్పారు. ”నేను రకరకాల మందిని పరిచయం చేశాను. అభిరాంనే ఎందుకు పరిచయం చేయాలి ? అభిరాం వాళ్ళకే సొంత నిర్మాణ సంస్థ వుంది. వాళ్ళే చేసుకోవచ్చు. కానీ దీనికి కారణం… రామానాయుడు గారు. ఆయన వున్నప్పుడు మా మనవడితో సినిమా చేయాలని అడిగారు. చేస్తానని చెప్పాను. తర్వాత ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ నేను లిఫ్ట్ చేయలేదు. కొన్నిరోజుల తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నాకు గిల్ట్ పట్టుకుంది. అంత పెద్ద మనిషి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా మాట తప్పాననే గిల్ట్ ఉండిపోయింది. అప్పుడు అభిరాం కోసం కథ రెడీ చేశాను. ఈ సినిమా రామానాయుడు గారికోసమే చేశాను’ అని చెప్పుకొచ్చారు తేజ.