ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఇందులో సీఎంలు చాలా చెప్పారు. అలాగే ప్రధాని కూడాచెప్పారు. భావితరాల భవిష్యత్ ను తాకట్టు పెట్టి.. దుబారా చేయవద్దని ఆయన రాష్ట్రాలకు హితవు పలికారు. అదేమిటో కానీ.. మోదీ బహిరంగసభల్లో అవినీైతి గురించి మాట్లాడినా.. రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడినా.. ప్రభుత్వాలు చేస్తున్న దుబారా గురించి మాట్లాడనా.. మొత్తంగా ఏపీనే గుర్తుకు వస్తుంది.దానికి రివర్స్ లో ఏపీలో జరుగుతున్నా .. కేంద్రం పట్టించుకోకపోవడమే దీనికి కారణం.
ఏపీలో వచ్చే పాతికేళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి బటన్లు నొక్కుతున్నారు. కేంద్రం నుంచి ఇక ఎలాంటి నిధులు అడగబోమనిరాసిచ్చి రూ. పది వేల కోట్లు తెచ్చుకున్నారు. ఆర్బీఐ నుంచి ప్రతి వారం అడ్డగోలుగా అప్పులు తీసుకు వస్తున్నారు. ఇన్ని చేసి.. మొత్తం అనుత్పాదక వ్యయం చేస్తున్నారు. ఈ విషయం కేంద్రానికి తెలియదా అంటే.. మొత్తం తెలుసు. అసలు ఇస్తోంది కేంద్రమే. మరి ఎందుకు మోదీ బయట అన్ని మాటలు చెబుతారు.. ఏపీ గురించి పట్టించుకోరు ?
అవినీతి గురించి.. అప్పుల గురించి మోదీ చెప్పే మాటలు వింటే.. అహా ఓహో అనుకుంటారు. కానీ నిజంగా ఆయన తీసుకునే చర్యలు మాటలకు తగ్గట్లుగా ఉంటాయా అంటే… అవన్నీ ఇతర పార్టీల వారికి వర్తిస్తాయి కానీ.. బీజేపీకి .. బీజేపీకి మద్దతిచ్చే వారికి కాదన్నట్లుగా ఉంటాయి. దేశంలో వ్యవస్థల పనితీరుపై మోదీ పాలనలో వచ్చినన్నీ అనుమానాలు ఇతరుల పాలనలో రాలేదంటే .. అతిశయోక్తి కాదు. దేశం కోసం మాటలు చెప్పడం కన్నా.. చేతల్లో చూపించడం కీలకం. అది మాత్రం కేవలం రాజకీయంగానే సాగుతోంది.