ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప రిస్థితి వైసీపీకి వచ్చింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అన్ని చోట్ల ఘనంగా జరుగుతున్నాయి. వైసీపీ కూడా నిర్వహించింది. అయితే ఆ కార్యక్రమం మొత్తం చంద్రబాబును తిట్టడానికే. అయినప్పటికీ వైసీపీ కూడా ఎన్టీఆర్ కు శత జయంతి ఉత్సవాలు నిర్వహించినట్లయింది.
వైసీపీ ఆధ్వర్యంలో లక్ష్మి పార్వతి పేరు మీద విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టాలీవుడ్లో వైసీపీ ప్రతినిధులయిన పోసాని కృష్ణమురళి, అలీ, రామ్ గోపాల్ వర్మ లాంటి వారు హాజరయ్యారు. అయితే ఈ జయంతి ఉత్సవాలకు హాజరైవారు ఎన్టీఆర్ గురించి మాట్లాడిన దాని కన్నా.. చంద్రబాబు గురించి తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయించారు. ఆర్జీవీ అయితే మరీ ముందుకెళ్లిపోయారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి అతిగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మగాడు అన్నట్లుగా చెప్పారు. ఎందుకంటే మహానాడుకు హాజరు కానందుకట.
గత కొద్దిరోజులుగా లక్ష్మి పార్వతితో ఎన్టీఆర్ కుటుంబసభ్యులపై ఎన్ని రకాల నిందలు వేయించాలో అన్ని వేయిస్తున్నారు. శత జయంతి ఉత్సవాల రోజున ఉదయమే ఆ పని పూర్తి చేసింది. అయితే చంద్రబాబును తాము ఎప్పుడూ తిట్టించే తిట్లేగాఅనుకోలేదు. కానీ ఎన్టీఆర్ ను మాత్రం ప్రత్యేకంగా గౌరవించుకోవాల్సి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎన్టీఆర్ ను గౌరవించింది లేదు కానీ.. ఇప్పుడు వైసీపీ మాత్రం గౌరవించాల్సి వచ్చింది.