జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంతో పోరాడటం మానేసి చాలా కాలం అవుతోంది. ఆయన తన కుటుంబం, రాజకీయ స్నేహితులు, అధికారంలోకి వచ్చిన వారిపై కుట్రలు చేసుకుంటూ.. అదే రాజకీయం అనుకుంటున్నారు తనను తాను కాపాడుకోవడం ఆయనకు ఈ రోజుల్లో ముఖ్యమైపోయింది. తాజాగా ఆయన కేసీఆర్ కుటుంబాన్న తీవ్రంగా ఇబ్బంది పెట్టేందుకు రెడీ అయినట్లుగా ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఇరికించేందుకు సాయం చేస్తానని జగన్ ఢిల్లీ పెద్దలకు హమీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఆ సాయం శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడమే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. తన భార్యకు ఆరోగ్యం బాగో లేదన్న కారణం చెప్పి బెయిల్ తెచ్చుకుని ప్రస్తుతం బయట ఉన్నారు. అరబిందో వారసుడు అయిన శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారం చేయడం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. ఈ కారణంగా అరబిందో షేర్ కూడా పడిపోయింది. తర్వాత అరబిందోలో ఉన్న పదవుల నుంచి ఆయనను తప్పించారు. కవిత, అరబిందో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్ కలిసే లిక్కర్ వ్యాపారం చేసి స్కాంకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారితే.. కవితను పూర్తి స్థాయిలో ఫ్రేమ్ చేయవచ్చని భావిస్తున్నట్లగా చెబుతున్నారు..
అమిత్ షాతో భేటీలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అవుతారన్న సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. అందుకే శరత్ చంద్రారెడ్డికి వై కేటగిరి భధ్రతను కేంద్రం కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ అయ్యాడు. ఆయన చెప్పిన వివరాలతో కవిత ఎక్కడెక్కడ భూములు.. ఎవరెవరి పేరు మీద కొన్నారో ఈడీ బయట పెట్టింది. ఇప్పుడు కవితను ఇబ్బందుల్లో నెట్టడానికి తెలంగాణలో బీజేపీకి రాజకీయ ప్రయోజనం కల్పించడానికి .. తనను తాను తాను కాపాడుకునేందుకు జగన్ రెడీ అయినట్లుగా చెబుతున్నారు.
వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి పేరును.. సీబీఐ చేర్చింది. అసలు హత్య మొత్తం ఓ కుట్రప్రకారం జరిగిందని.. ఒక్కో డాట్ కలుపుకుంటూ వస్తోంది. అవి జగన్ దగ్గర ఎండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆయన.. తన కోసం అయినా నమ్మిన వాళ్లను నట్టేట ముంచడానికి రెడీ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇలా చేస్తే కేసీఆర్ ఊరుకుంటారా అన్నది కీలక అంశం. ఆయన ప్రతీకార చర్యలకు దిగితే జగన్ కు మరో వైపు నుంచి ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.