ఆంధ్రప్రదేశ్ యువతకు జగన్ ఇప్పటికే ఆరు లక్షల ఉద్యోగాలిచ్చారు. మరో వెయ్యి ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నాలుగేళ్లుగా గ్రూప్ వన్, టు ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో యువతకు అబద్దాలు చెప్పి.. అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మోసం చేశారు. నాలుగేళ్లుగా బాజ్ క్యాలెండర్ లేదు. మధ్యలో ఓ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి… అందులో పదో పరకో గ్రూప్స్ పోస్టులు పెట్టారు. అవి కూడా భర్తీ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలుక ముందు వెయ్యి గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ చేయడానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ప్రచారం ప్రారంభించారు.
అసలు గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ముందుగా ప్రభుత్వం చేసిన కొన్ని నిర్వాకాలను సరి చేయాల్సి ఉంది. అందులో మొదటిది జోన్ సమస్య . రాజకీయాల కోసం జిల్లాలను విభజించేసిన ప్రభుత్వం ఆ తర్వాత చేయాల్సిన పనులను చేయలేదు. ఫ్రీ జోన్..ఇతర జోన్లను వర్గీకరించలేదు. రాష్ట్ర పతి ఉత్తర్వులను సవరించాల్సి ఉంది. ఆ ప్రయత్నాలేమీ చేయలేదు. కానీ ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై ఎవరు కోర్టుకు వెళ్లినా ప్రక్రియ ఆగిపోతుంది. తెలంగాణలో చాలా కాలం పాటు అదే జరిగింది. అన్నింటినీ పరిష్కరించుకుని ఇటీవలే ఉద్యోగాల భర్తీ ప్రారంభించారు.కానీ పేపర్ లీకేజీలతో మొదటికే మోసం వచ్చింది.
వాలంటీర్ల ఉద్యోగాలు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని అదే పనిగా ప్రచారం చేసుకుంటోంది ప్రభుత్వం. అవసరం అయినప్పుడు వాలంటీర్లను ఉద్యోగులుగా.. అవసరం లేనప్పుడు స్వచ్చంద సేవకులగా సంబోధించే సీఎం జగన్.. తీరుపై వారికి క్లారిటీ ఉంది. ఇక సచివాలయ ఉద్యోగులకు గ్యారంటీ లేక.. ఉద్యోగాలు వదిలి పెట్టి వెళ్లిపోతున్నారు. ఇవి కాక సీఎం జగన్ ఇచ్చిన ఉద్యోగాలే లేవు. ఎన్నికలకు ముందు మాత్రం కొత్త డ్రామా ప్రారంభిస్తున్నారు.