తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో పెరిగేలా సన్నాహాలు చేస్తోంది. అయితే తెలంగాణ రావడంలో తమ పాత్ర కూడా ఉందని చెప్పుకునేందుకు బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తున్ామని కిషన్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందని.. ప్రకటించారు.
తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను వివిధ రాష్ట్రాల్లోనూ నిర్వహి్తున్నామని ఆయా రాష్ట్రాల్లో నివసించే తెలంగాణ ప్రజలను రాజ్‌భవన్లకు ఆహ్వానించి, గవర్నర్ల ఆధ్వర్యంలో జరిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను అన్ని చోట్లా జరుపుకునేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఢిల్లీలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో జరుగుతాయని.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లక్షలాది తెలంగాణ ప్రజలు, కుటుంబాలు భాగస్వాములయ్యాయని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర చాలా కీలకమని కిషన్ రెడ్డి చెబుతున్నారు. పార్లమెంటులో సుష్మా స్వరాజ్ నేతృత్వంలో బీజేపీ 160 మంది ఎంపీలు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కీలక పాత్ర పోషించామని బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని బీఆర్ఎస్ నేత కే. కేశవరావు ఓ సందర్భంగా చెప్పారని.. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం. ఇతర రాజకీయ పార్టీల కంటే ముందే కాకినాడలో తీర్మానం చేశామని చెప్పుకొచ్చారు. కారణం ఏదైనా తెలంగాణ సెంటిమెంట్ ను అందిపుచ్చుకోవడంలో చివరి క్షణంలో రంగంలోకి దిగడం వల్ల ఎలాంటి ప్రయోజనం రాకపోకా… బీఆర్ఎస్‌కు మేలు చేస్తున్నట్లుగా మారిపోతోంది. అయినా బీజేపీ నేతలు.. బీఆర్ఎస్ నేతల ట్రాప్ లో పడుతూనే ఉన్నారు.