డ్రీమ్ హౌస్.. అంటూ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. తమ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ కలలు కంటుంటారు. అలాంటి కల ప్రభాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగులతో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాలని ఎప్పటి నుంచో ప్రభాస్ ఆశ. ఇటీవల హైదరాబాద్ శివార్లలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఓ ఫామ్ హౌస్ కొన్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్‌ని ఆధునీకరించే పనులు జరుగుతున్నాయి. ఫామ్ హోస్ అంటే.. గార్డెన్ ఏరియా, హట్స్, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి సహజం. ప్రభాస్ కాస్త భిన్నంగా ఆలోచించాడు. తన ఫామ్ హౌస్‌లో ఓ చిన్నపాటి గుహలాంటిది నిర్మించుకొంటున్నాడట. అందుకోసం విదేశీ నిపుణులు పని చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్.. కొండ లాంటి ప్రదేశంలో ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే… సిటీ లుక్ మొత్తం కనిపిస్తుంటుంది. అందుకే… ఆ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభాస్ భావిస్తున్నాడట. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. సినిమాకి రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకూ పారితోషికం తీసుకొంటున్నాడు. యువ కథానాయకులంతా తమ సంపాదనని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. ప్రభాస్‌కి అలాంటి వ్యాపకాలేం లేవు. ప్రస్తుతానికి ఈ ఫామ్ హౌస్‌పైనే భారీగా పెట్టుబడి పెడుతున్నట్టు టాక్.