టీడీపీ మేనిఫెస్టోను ఎద్దేవా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేసిన ప్రయత్నం రివర్స్ అయింది. టీడీపీ మేనిఫెస్టోను కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఇచ్చిన హామీల్ని కలిపి తయారు చేశారని అది బిసిబిళ్లబాత్ అని తనకు మాత్రమే సాధ్యమైన నవ్వు రాని ముఖాన్ని నవ్వుతూ చెప్పారు. బిసిబిళ్లబాత్ అంటే చాలా మందికి తెలియదు కానీ.. అది కర్ణాటక ప్రకటలకు అత్యంత ఇష్టంమైన వంటకం. తెలుగు వాళ్లు ఉప్మాను ఎంత ఈజీగా చేసుకుని తింటారో అక్కడ బిసిబిళ్లబాత్ ను చేసుకుంటారు. ప్రతీ హోటాల్ లోనూ అమ్ముతారు. అక్కడి ప్రజలు చాలా ఇష్టమైన వంటకంతో .. టీడీపీ మేనిఫెస్టోను పోల్చడంతో.. మేనిఫెస్టోను బాగుందని చెప్పినట్లయింది.
మేనిఫెస్టో బాగో లేదని జగన్ ఎక్కడా చెప్పలేదు. కర్ణాటక నుంచి తెచ్చారని.. మరొకటని చెప్పుకొచ్చారు. అమలు చేయరని వాదించడానికి ప్రయత్నించారు. కానీ మేనిఫెస్టో బాగో లేదని మాత్రం చెప్పలేకపోయారు. టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ నేతలు విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నారు. సీఎం జగన్ కూడా తన పథకంమీట నొక్కే కార్యక్రమంలో టీడీపీ మేనిఫెస్టో కోసం కనీసం ఇరవై నిమిషాలు కేటాయించడంతో టీడీపీ నేతలు సంబర పడుతున్నారు. తాము అమలు చేస్తామో లేదో ప్రజలు నమ్ముతారని.. కానీ తమ మేనిఫెస్టో గురించి జగన్ కూడా ప్రచారం చేయడం చాలని వారనుకుంటున్నారు.
రైతుల్ని అడ్డగోలుగా మోసం చేయడంలో జగన్ రెడ్డి రాటుదేలిపోయారు. కేంద్రం పీఎం కిసాన్ అనేపథకం పెట్టక ముందే.. ఊరూవాడా తిరిగి మేలు ఒకే సారి పన్నెండున్నర వేు రైతుల ఖాతాలో వేస్తానని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇస్తున్నవి మినహాయించి మిగతా విస్తానన్నారు. అవి కూడా అందరికీ ఇవ్వడం లేదు. ఇప్పుడు మొత్తంగా ఐదున్నరవేలు మాత్రమే రైతుల ఖాతాలో వేస్తున్నారు. ఈ ఐదున్నర వేలు ఇచ్చి రైతులకు ఇచ్చే అన్ని పథకాలు ఆపేశారు.
మేనిఫెస్టోను 98.4 శాతం అమలు చేశామని.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలం నుంచే చెప్పుకుంటున్నారు.. కానీ మేనిఫెస్టో ముందు పెట్టుకుంటే.. ఒక్కటి కూడా అమలు చేసిటన్లుగా ఎవరికీ తెలియదు. అయినా తాము చెప్పుకుంటే అమలు చేసినట్లేనని.. ఇతరులు అమలు చేయరని.. కథలు చెబుతున్నారు.