సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎవరు .. ఎలాంటి జనబలం లేకపోయినా ప్రభుత్వాన్ని అలవోకగా నడుపుతున్న వ్యక్తి. వ్యవస్థలన్నింటినీ ఎలా వాడేసుకోవాలో పీహెచ్డీ చేసిన ఘనుడు. అలాంటి వ్యక్తి కుమారుడు ఎలా ఉండాలి ? అంచనా వేయడం కష్టం.కానీ ఎలా ఉన్నాడో చూస్తే మాత్రం.. ప్చ్ అనుకోక తప్పదు. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ అయినా ఇంకా బిగినర్స్ మిస్టేక్స్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు.
టీడీపీ మేనిఫెస్టో బయటకు వచ్చాక.. వైసీపీ సోషల్ మీడియాకు ఉక్కపోత ప్రారంభమయింది. ఎలా అమలు చేస్తారు అని వైసీపీ వాళ్లు ప్రశ్నించక ముందే.. సంపద సృష్టి అంటూ టీడీపీ గట్టి ప్రచారమే చేస్తోంది. దీంతో సంపద సృష్టిలో జగనే నెంబర్ వన్ అని చెప్పుకోవాలనే తాపత్రయంతో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ రంగంలోకి దిగారు. గణాంకాలతో సహా ఓ పోస్టర్ తయారు చేసి.. స్వయంగా తన వాల్ మీద పోస్ట్ చేసుకున్నారు. ఇది కదా సంపద సృష్టి అంటే అని రాసుకున్నారు. అంతే.. అందులోని ఫిగర్స్.. గ్రాఫిక్స్ చూసి .. టీడీపీ వాళ్లు భళ్లున నవ్వుతున్నారు.
జీఎస్డీపీ విపరీతంగా పెరిగిపోయిందని సజ్జల భార్గవ గ్రాఫిక్ చేియంచారు. కానీ2021-22కి 2022-23కి రూ. 2 లక్షల కోట్ల జీఎస్డీపీ తగ్గింది. కానీ మ్యాప్‌లో మాత్రం పొడుగైన బార్ వేశారు. తగ్గితే ఎందుకు పొడుగ్గా వేశారు కొంత మంది జోలేస్తూంటే.. అది కూడా ఎస్టిమేటెడ్ అని పక్కన కనిపించని అక్షరాల్లో రాశారు. ఎస్టిమేటెడే అది అంటే ఇంకా తక్కువే ఉంటుందన్నమాట. అది కాకుండా..ఈ ఆర్థిక సంవత్సవరం అంటే 2023-24లో ఇంకా రెండు నెలలు కాలేదు కానీ ఆకాశంలో అంచనాలు వేశారు. ఏకంగా 14 లక్షల కోట్ల జీఎస్డీపీ ఉంటుందని వేశారు. ఈ బార్ పక్కన ఎక్స్ పెక్టెడ్ కనిపించని అక్షరాలతో రాసుకున్నారు.
ఈ గ్రాఫిక్ సోషల్ మీడియాలో లాఫింగ్ స్టాక్ అయిపోయింది. తిమ్మిని బమ్మిని చేసే సజ్జల పుత్రరత్నం ఇలా నవ్వుల పాలవుతున్నాడేంటి అనే సెటైర్లు పడుతున్నాయి.