రామ్ గోపాల్ వర్మ ఏం చేయాలనుకుంటున్నారో కానీ ఆయన తాను అమి అనుకుంటున్నారో దాన్ని ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. తాజాగా తాను జగన్ బయోపిక్ పేరుతో తీస్తున్న వ్యూహం అనే సినిమా స్టిల్స్ ఓ నాలుగు విడుదల చేశారు. ఈ నాలిగింటిలో నటి మానసి రాధాకృష్ణన్ హైలెట్ అయ్యారు. అందులోని ఆమె హావభావాలు అచ్చంగా జగన్ భార్య వైఎస్ భారతిని పోలినట్లే ఉన్నాయి.అదే సమయంలో ఆమె భారతి క్యారెక్టర్ లో నటిస్తున్నారని స్వయంగా ఆర్జీవీ ప్రకటించారు. దీంతో ఈ సినిమా అంతా భారతి చుట్టే తిరుగుతుందన్న ప్రచారం ప్రారంభమయింది.
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఈ ఫోటోలను భిన్నంగా సర్క్యూలేట్ చేస్తున్నారు. బాబాయ్ హత్య గురించి సినిమాలో కీలకమైన సీన్లు ఉంటాయని … చెబుతున్నారు. ఆ ఫోటోలు చూస్తే అదే విషయం అర్థమైపోతుంది. అలా అర్థమవ్వాలనే ఆర్జీవీ ఆ ఫోటోను లీక్ చేశారు. కానీ రివర్స్ లో … వైఎస్ భారతి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా ప్రచారం జరగడంతో ఆర్జీవీ కంగారు పడిపోయినట్లుగా నటిస్తూ.. టీడీపీ సోషల్ మీడియాలోని కొన్ని ఖాతాల్లో వారు పెట్టిన పోస్టులను తానే షేర్ చేసుకుని రిప్లయ్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఆర్జీవీ ఉద్దేశం ఏమిటో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు.
ఆర్జవీ ఎవరి విషయంలో ఆయినా బ్యాడ్ గా ఇమేజ్ ను ఇంప్రెషన్ పపాలనుకుంటే.. ఇలాగే చేస్తారని.. వైఏస్ భారతి విషయంలో ఆయన ఇలాగే తేడాగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు వైసీపీ క్యాడర్ లో వస్తున్నాయి. అసలు సినిమా వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ పై జరిగిన కుట్రల కథ అయితే. . భారతి టాపిక్ ఎందుకు తెచ్చారని..పైగా ఆమెకు సంబంధించిన ఫోటోలే ఎందుకు లీక్ చేసి.. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా ఎందుకు హైలెట్ చేస్తున్నారని అంటున్నారు. చాలా మంది నెటిజన్లు .. ఆర్జీవీ డైరక్ట్ చేసిన పోర్న్ సినిమా పోస్టర్లను ఈ వ్యూహంతో పాటు వైరల్ చేస్తున్నారు.