తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం జూన్ 2న దేశం మొత్తం ప్రచారంతో హోరెత్తించింది. తెలంగాణలో చేసే సంబరాల ఖర్చు కాకుండా మీడియాలో ఇచ్చే ప్రకటనలు ఓరేంజ్ లో చేసింది. అధికారికంగా ఐ అండ్ పీఆర్ విభాగం నుంచి ఒక్కో పేపర్లో 12 ఫుల్ పేజీల అడ్వర్టయిజ్మెంట్లను ఇచ్చేసింది. ఒక్క మన రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పబ్లిసిటీ ఇచ్చింది.
ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ ఫొటోలతో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. హిందీ, ఇంగ్లిష్, తమిళ్, కన్నడ, మరాఠీ, పంజాబీ, ఒరియా పత్రికల్లోనూ తెలంగాణ అవతరణ వేడుకల పేరుతో ప్రకటనలు ఇచ్చారు. శుక్రవారం ఒక్కరోజే మీడియాలో పబ్లిసిటీకి దాదాపు రూ.300 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా చెబుతున్నారు కేసీఆర్ తన జాతీయ రాజకీయాల ప్రచారానికి ఇలా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారని.. ఇతర రాష్ట్రాల వారిని తన రాజకీయ అవసరాల కోసం ఉద్యోగాల్లో తీసుకుని వారితో పార్టీ పనులు చేయించుకుంటున్నారని కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతీ వారం ఆర్బీఐదగ్గర అప్పులు తెస్తోంది. అదే సమయంలో భూములు అమ్ముతోంది . ఇలా వస్తున్న సొమ్మునంతా దుబారా చేస్తున్నారన్న విమరసలు ఈప్రచార ఆర్బాటాల ద్వారా సహజంగానే వస్తున్నాయి. అయితే కేసీఆర్ ఇలాంటి వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.