తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులపై కేసులతో విరుచుకుపడుతోంది ప్రభుత్వం. ఉద్యోగసంఘం నేత సూర్యనారాయణను కూడా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తోంది. ఆయన సంఘంలోని నలుగురు ఉద్యోగులపై కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపేలా చేసింది. నిజానికి వారు తప్పు చేశారా లేదా అన్నది తర్వాత సంగతి ముందుకేసు పెట్టి సాక్ష్యాలున్నాయని కోర్టుకు చెప్పి.. రిమాండ్ కు పంపేస్తారు.అది వారు సాధించాలనుకున్నది తర్వాత సాక్ష్యాలున్నాయా లేవా అన్నది వారికీ అనవసరం కానీ…వారికి జైలుకు పంపామా లేదా అన్నది ముఖ్యం. ఆ లక్ష్యం సాధించుకుంటున్నారు.
ప్రస్తుతం ఇలా నలుగుర్ని రిమాండ్ కు పంపారు. సూర్యనారాయణ పేరు కూడా వెలుగులోకి తెచ్చారు. ఆయన ఇక మాట్లాడవద్దని మాట్లాడితే ఇలాగే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న సంకేతాలు ఇచ్చారు. ఆయన నోరు మూస్తారో… తనను నమ్మి అరెస్టయిన ఉద్యోగుల కు అండగా ఉంటారో చూడాల్సి ఉంది. ఇప్పటికి అయితే ఆయన ఆజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక బొప్పరాజు సత్యనారాయణ కు కూడా ఇది ఓ హెచ్చరిక లాంటిదే అంటున్నారు. ఆయనే మరింత దూకుడుగా ఉద్యమం చేస్తున్నారు. ఎపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. వారికి ఉద్యోగుల సమస్యల కన్నా ప్రభుత్వమే ముఖ్యం. కాబట్టి వారిపై కేసులు ఉండవు సరి కదా… ప్రోత్రాహకాలు అందుతూ ఉంంటాయి.
అయితే ప్రశ్నించిన ఉద్యోగుల్ని అరెస్ట్ చేసి అందర్నీ భయపెట్టగలం అనుకుంటే ప్రభుత్వానికి అంత కంటే భావదారిద్ర్యం ఉండదన్న అభిప్రాయం ఉద్యోగుల్లోనే వినిపిస్తోంది. ఉద్యోగుల సమస్యల కోసం పోరాడటం అనేది కొత్తగా లేదని.. అది వారి హక్కు అని..వారిని ఇలా కేసుల్లో ఇరికిస్తామనుకోవడం తెలివి తక్కువ తనానికి నిదర్శనమన్న అభిప్రాయం వినిపిస్తున్నారు. ఉద్యోగులను పూర్తిగా వ్యతిరేకం చేసుకుని ఏం సాధిస్తారని అంటున్నారు. అయితే ఇలాంటి వ్యతిరేకతల గురించి పాలకులు ఎప్పుడో మర్చిపోయారు. చేయాలనుకున్నది చేస్తున్నారు.. ఎవర్ని అరెస్ట్ చేయాలనుకుంటే వారిని చేస్తున్నారు .