రాజకీయాల్లో నెగెటివ్ ప్రచారాలు ఒక్కోసారి ఆ నాయకుడికి మాస్ ఇమేజ్ తెచ్చి పెడుతూ ఉంటాయి. ఇంత కాలం లోకష్ ను టార్గెట్ చేసిన వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు కూడా గుడ్డిగా అదే పద్దతిలో వెళ్తూ ఆయనకు ఎనలేని మేలు చేస్తోంది. తాజాగా ఫ్లెక్సీల విషయంలో లోకేష్ ఓ అసభ్యపదం వాడాలంటూ వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. గతంలో లోకేష్ కు ఉన్న ఇమేజ్ కు యవగళంలో ఆయన ఇమేజ్‌కు చాలా మార్పు వచ్చింది. ఆయన చాలా సాఫ్ట్ అని అనుకునేవారు. కానీ కడపలో అడుగుపెట్టిన తర్వాత ఆయనలో మాస్ కోణాన్ని … వైసీపీ సోషల్ మీడియానే ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తోంది.
ప్లకార్డులు పట్టుకోవద్దంటూ పోలీసులు వారించిన ఘటనలో లోకేష్ చెప్పిన ధీటైన సమాధానానికి పోలీసుల వద్ద సమాధానం లేకపోయింది. తర్వాత కూడా ఫ్లెక్సీల విషయంలో అదే పరిస్థితి. అక్కడ లోకేష్ అసభ్యకరపదం వాడారంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు కూడా.. ఇది శాంపిలేనని.. మీరు మాట్లాడిన బాషకు అంతకు మించిన రివర్స్ కౌంటర్లు ముందుముందు వస్తాయని అంటున్నారు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లోనే ఇలాంటి పదం వాడారు.. సీఎం జగన్.. అన్నమయ్య డ్యాం బాధితులకు అదేపదంతో భరోసా ఇచ్చినట్లుగా మాట్లాడారు. ఆ వీడియోలన్నీ సర్క్యులేషన్ లోకి వస్తున్నాయి.
తమలపాకుతోఒకటంటే తలుపు చెక్కతో రెండు అనడానికి రాజకీయ పార్టీల నేతలు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అధికారం ఉంది… నోరు ఉంది కదా అని రెచ్చిపోతే.. రేపు ఆ నోరు.. అధికారానికి బలి కావాల్సి ఉంటుంది. వైసీపీ ఇంత కాలం తమ నోళ్లను డ్రైనేజీలా . ..టీడీపీలా పారించింది. ఇప్పుడు మెల్లగా సీన్ మారుతోంది. ఇప్పుడే తట్టుకోలేకపోతున్నారు.. అధికారం మారిన తర్వాత టీడీపీ నేతల మాటలకు ఎలా తట్టుకుంటారని ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు సహజంగానే సెటైర్లు వేస్తున్నారు.