ఢిల్లీ లిక్కర్ స్కాలో అప్రూవర్ల ఎపిసోడ్ నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు మొత్తం నలుగురు, ఐదుగుర్ని అప్రూవర్లుగా మార్చేశారు. తాజా జాబితాలో శరత్ చంద్రారెడ్డి చేరారు. ఆయన అప్రూవర్ గా మారుతానని.. క్షమాభిక్ష కావాలని పిటిషన్ వేశారు. కోర్టు అంగీకిరంచరించింది. ఇప్పుడు శరత్ రెడ్డి తాను నేరం చేశానని ఒప్పుకుంటున్నారు. స్కాంలో ఎవరి పాత్రేమిటి అన్నది వివరిస్తారు. దీంతో ఆయనకు అతి తక్కువ శిక్ష పడటమో లేదా అసలు శిక్ష పడకపోవడమో జరుగుతుంది. ఇదంతా ఎందుకయ్యా అంటే…. కేజ్రీవాల్, కవితను టార్గెట్ చేయడానికని ఎక్కు మంది నమ్ముతున్నారు.
ఇక్కడే ఓ అనుమానం అందరికీ వస్తోంది. నిందితుల్ని ఇలా అప్రూవర్లుగా మార్చేసి… వారికి క్షమాభిక్ష పెట్టేస్తున్నారు. ఇదే ఫార్ములాను కవిత, కేజ్రీవాల్ కూడా అడాప్ట్ చేసుకుంటే. తాను కూడా అప్రూవర్ అవుతానని కవిత , కేజ్రీవాల్ కూడా పిటిషన్లు దాఖలు చేసుకుంటే వారికీ క్షమాభిక్ష ఇచ్చేస్తారా ?. ఒకరిని ఇరికించడానికి చేసే అప్రూవర్ల రాజకీయంలో ఇలాంటి ట్విస్టులు కూడా ఉండవచ్చు. స్పష్టమైన సాక్ష్యాలతో కేసులు నమోదు చేసినప్పుడు ఇలాంటి డొంక తిరుగుడు అప్రూవర్ల రాజకీయాలు చేయాల్సి పని లేదు.
వైఎస్ వివేకా కేసులోనూ అప్రూవర్ దస్తగిరి .. తామే వివేకాను అడ్డంగా నరికేశామని చెబుతున్నారు. అప్రూవర్ అయ్యారని ఆయనను అరెస్ట్ చేయలేదు. ఆయన ఇప్పుడు సెటిల్మెంట్లు చేస్తున్న వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది నరికేసిన వ్యక్తి రోడ్డు మీద తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు. అప్రూవర్ గామారినంత మాత్రాన అడ్డగోలు స్వేచ్చ ఇ,స్తే .. చేసిన నేరం నుంచి క్షమాభిక్ష ప్రసాదిస్తే అంతే.
ఇప్పుడు కవిత, కేజ్రీవాల్, అవినాష్ రెడ్డిలు కూడా అప్రూవర్ పిటిషన్లు వేసుకుని దిలాసాగా కేసు నుంచి బయటపడిపోవచ్చుననే సెటైర్లు ఈ కారణంగా వస్తున్నాయి.