చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా ను కలిశారు. వారి మీటింగ్ మధ్యలో జేపీ నడ్డా వచ్చి కలిశారు. మాట్లాడుకున్నారు. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. పొత్తులు ఉంటాయా .. ఉంటే ఎక్కడ .. అసలు రాజకీయాలపైనే మాట్లాడారా అనే సందేహాలు ఉండనే ఉన్నాయి. ఆ మీటింగ్ ఏం చర్చించారో కానీ… వైసీపీ మీడియా.. కూలీ .. నీలి మీడియా మొత్తం వివిధ కోణాల్లో తమ భయాందోళనలు వ్యక్తంచేస్తూ వస్తోంది.
ఒకరేమో జగన్ నుంచి రామోజీరావును కాపాడమని వెళ్లారని రాసుకుంటారు. ఒకరేమో పొత్తులు పెట్టుకోవాలని బతిమాలుకోవాలని వెళ్లారంటారు.. మరొకరేమో విలీన ప్రతిపాదన పెట్టారంటారు…. వీళ్లు కంగారు చూస్తే.. మొత్తంగా.. చంద్రబాబు ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసేసి… జగన్ ఎంతో కష్టపడి పొందుతున్న రిలీఫ్ లన్నీ తెగ్గొట్టేసి వచ్చి ఉంటారేమో అని భయపడుతున్నట్లుగా కనిపిస్తోందని సహంజగానే సెటైర్లు పడుతున్నాయి. హత్య లాంటి తీవ్రమైన కేసులు సహా ఎన్నో కేసులు వెనుకేసుకుని ఏ మాత్రం రాజకీయంగా సస్టెయిన్ అయ్యే అవకాశం లేని నేతగా జగన్ ప్రస్తుతం అందరి కళ్ల ముందు ఉన్నారు.
ఆయనను బీజేపీ నమ్ముకునే అవకాశాలు తక్కువ .ఏ మాత్రం వెన్నుముక లేని వ్యవహారం.. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న తీరు… కేంద్ర పెద్దలుక కూడా ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. ఆయనను నమ్మకమైన రాజకీయ నాయకుడిగా భావించలేరు. పైగా చంద్రబాబు ఓ సారి ఎవరితోనైనా సమావేశం అయితే.. మొత్తంగా వాళ్లను తన స్కిల్స్ తో తనకు తగ్గట్లుగా మార్చేసుకుంటారన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో జగన్ క్యాంప్ కంగారు పడుతోంది. ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతోంది. అందుకే చంద్రబాబు – షాల భేటీపై రకరకాల ప్రచారాలు తెరపైకి తెస్తున్నారు.