ఈనాడులో ఫుల్ పేజీ ప్రభుత్వ ప్రకటనలు రావడం లేదు. ఈనాడు యాజమాన్యమే ప్రభుత్వ ఫుల్ పేజీ యాడ్స్ వచ్చిందని చెప్పిందనేది అందరికీ తెలిసిన విషయం . సీఎం జగన్ ఇవ్వవద్దని ఆదేశించారని అందుకే ఇవ్వడం లేదని వైసీపీ సపోర్టర్స్ కాస్త స్వయంతృప్తి పొందుతున్నారు కానీ.. అలా ఇవ్వకూడదని నిజంగా జగన్ రికార్డెడ్ గా జగన్ ఆదేశించినట్లయితే.. చట్టపరమైన చిక్కుల్లో పడేది ఆయనే. అందుకే నాలుగేళ్ల పాటు ఈనాడుపై ఎన్ని కుట్రలు చేసినా.. చివరికి రామోజీరావుపై సీఐడీ కేసులు నమోదు చేసినా ప్రకటనలు ఇస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఈనాడు అధికారికంగా వద్దన్నది కాబట్టి ప్రకటనలు ఇవ్వడం లేదు.
ఈనాడు ఎందుకు వద్దన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై రాబోయే రోజుల్లో సంచలన విషయాలను ఈనాడు బయట పెట్టబోతోందని చెబుతున్నారు. అదే సమయంలో పత్రిక మొదటి పేజీలో ప్రభుత్వ యాడ్స్ కనిపించినప్పుడు లూజ్ సేల్స్ దారుణంగా పడిపోతున్నాయి . ఈనాడుకు బదులు ఆంధ్రజ్యోతి కొనుగోలు చేస్తున్నారు. అలాగే.. ఏపీలో రాజకీయ పరిస్థితిపై సమగ్రమైన అధ్యయనం చేసి రిపోర్టులు తెప్పించుకున్న ఈనాడు పెద్దలు ఈ ప్రభుత్వం నిలబడేది కాదని అంచనాకు వచ్చారట. అందుకే ఏడాదికి రూ. నలభై కోట్ల వరకూ ఆదాయ నష్టం వస్తుందని తెలిసినా సరే ప్రకటనలు వద్దనేశారని అంటున్నారు.
ఈనాడులో ప్రభుత్వ ప్రకటనలు రాకపోవడం వల్ల ఇప్పుడు…. ఫలనా పథకానికి జగన్ మీట నొక్కుతున్నారన్న విషయం మెజార్టీ ప్రకటలకు తెలియడం లేదు. గతంలో ఈనాడులో వచ్చే ఫ్రంట్ పేజీ కారణంగా ఓహో ఈ రోజు ఈ పథకానికి మీట నొక్కుతున్నారా అని తెలుసుకునేవారు. ఆ ఎఫెక్ట్ ప్రభుత్వంపైనే బాగానే పడుతోంది,. ఏపీలో సాక్షి సర్క్యూలేషన్ పూర్తిగా వాలంటీర్లు… గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల దగ్గరే ఉంది. డబ్బులు పెట్టి కొనే చందాదారులు లక్ష మంది కూడా ఉండరని అంచనా వేస్తున్నారు.