వ్యాపార సంస్థలు కార్పొరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటాయి. రాజకీయ పార్టీలు ప్రధాన కార్యాలయాలనే ఏర్పాటు చేసుకుంటాయి. అయితే ప్రధాన కార్యాలయం పేరుతో కార్పొరేట్ లెవల్ ఆఫీసును బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకుంటోంది. ఇటీవలే కోకాపేటలో అత్యంత ఖరీదైన పదకొండు ఎకరాలను అతి తక్కువకే కేబినెట్లో కేటాయింప చేసుకున్న కేసీఆర్ నెల వ్యవధిలోనే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని.. కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసేశారు.
సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పేరుతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్థుల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది . ప్రతి జిల్లాలోనూ భారీ ఆఫీసులు రెడీ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మరే ఇతర రాజకీయ పార్టీలకు లేని విధంగా శిక్షణా సంస్థను ఏర్పాటు చే,సుకుంటోంది.
రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణఆ తరగతులు, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచారం లభించేలా భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్రం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే భూమి కేటాయింపు కోసమే ఇలా చెప్పారని.. నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్ ఎక్కువ సమయం అక్కడే గడిపేలా ఏర్పాట్లు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బంజారాహిల్స్ లో ఉన్న పార్టీ ఆఫీసు అత్యంత బిజీ ఏరియాలో ఉండటంతో.. ఆ కార్యాలయం రెడీ అయిన తర్వాత పూర్తిగా అక్కడ్నుచే కార్యకలాపాలు జరగుతాయంటున్నారు