తెలుగుదేశం పార్టీ రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన విజన్ తో ముందుకు వెళ్తోంది. కుప్పంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడే్… రాయలసీమలో పాదయాత్ర పూర్తయ్యే సమయానికి ఈ ప్రాంత ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను ప్రకటిస్తాని లోకేష్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు పాదయాత్ర కడప జిల్లాలోకి ఎంటర్ అయింది. సగం నియోజకవర్గాలను కవర్ చేసింది. ఏడో తేదీన కడపలో జరగనున్న కార్యక్రమంలో రాయలసీమ అభివృద్ధిపై ప్రణాళికనులోకేష్ ప్రకటించనున్నారు.
తన పాదయాత్ర ద్వారా తెలుసుకున్న విషయాల ద్వారా లోకేష్ ఈ ప్రణాళిక అమలు చేస్తున్నారు. సీమలో ఉపాధి లేక వలసలు పోతున్న కూలీల కన్నీరును, ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్న యువత సమస్యలను యువగళం పాదయాత్రలో లోకేశ్ నేరుగా తెలుసుకున్నారు. అలాగే సీమలో సాగునీరు లేక, సాయం అందక రైతన్నలు పడుతున్న ఇబ్బందులను, అక్కచెల్లెమ్మలు పడుతున్న కష్టాలనూ స్వయంగా చూశారు. వీటన్నింటినీ క్రోడీకరించి.. రాయలసీమ ప్రణాళిక తయారు చేశారు.
రాయలసీమను సొంత ఆస్తిలాగా వాడుకుంటూ దశాబ్దాలుగా పెత్తనం చేస్తున్న వైఎస్ ఫ్యామిలీ.. చేసిన అభివృద్ధి శూన్యం. ప్రజలు ఆర్థికంగా బలవంతులైతే తమ మాట వినరన్న ఉద్దేశంతో పరిశ్రమల్ని రాకుండా చేసేవారు. వారి ప్రభుత్వాలు లేనప్పుడు… వచ్చే ఇతర ప్రభుత్వాలు సీమలో పరిశ్రమల్ని ప్రోత్సహించేవి. ఇలాంటి పరిస్థితుల్నిప్రజలకు వివరించడంలో ముందు ఉన్న లోకేష్… తన ప్రణాళికనుప్రకటించి… రాయలసీమ వాసుల నమ్మకాన్ని చూరగొనాలని అనుకుంటున్నారు.