టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కడప జిల్లాలో సాగుతోంది. నిజానికి మూడు జిల్లాల్లో సాగిన పాదయాత్ర ఓ ఎత్తు.. . కడప జిల్లాలో సాగే పాదయాత్ర మరో ఎత్తు అనుకున్నారు. అయితే మిగిలిన మూడుజిల్లాల కన్నా కడపలోనే ఎక్కువ జన ప్రవాహం కనిపిస్తోంది. ఏ నియోజకవర్గానికి వెళ్లినా అదే పరిస్థితి. జమ్మలమడుగులో వచ్చిన జనాన్ని చూసి… అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత మైదుకూరు.. ఇప్పుడు కమలాపురంలోనూ అదే పరిస్థితి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ప్రతిపక్ష పార్టీల నాయకుల కు ఇంత స్థాయిలో ఆదరణ లభించడం అంటే.. ఇది ఖచ్చితంగా ఓ సంకేతమేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
అన్ని రాజకీయ పార్టీల నేతలూ తమ పార్టీ కార్యక్రమాలకు జన సమీకరణ చేస్తారు. అయితే ఈ జన సమీకరణ చేయాలంటే.. పార్టీలో కింది స్థాయి క్యాడర్ కూడా యాక్టివ్ గా ఉంటేనే సాధ్యమవుతుంది. ఓ గ్రామస్థాయి నాయకుడు తనతో పాటు పది మందిని తీసుకు వస్తేనే టీడీపీ క్యాడర్ ఎక్కువ కనిపిస్తారు,. వారికి తోడు స్వచ్చందంగా జనం తరలి వస్తే ఇక చెప్పాల్సిన పని లేదు. అలాంటి స్థితి ప్రస్తుతం యువగళంలో కనిపిస్తోంది. టీడీపీ నేతల జన సమీకరణకు తోడుగా స్వచ్చందంగా తరలి వస్తున్న జనంతో పాదయాత్ర దద్దరిల్లిపోతోంది. ఈ స్చచ్చందంగా జనం వచ్చేది ప్రభుత్వం పెట్టే బాధల్ని భరించలేనప్పుడే.
లోకే,ష్ కూడా తన శైలితో అటుప్రజల్ని ఇటుక్యాడర్ ను ఉత్సాహ పరుస్తున్నారు. తనపై ఉన్న ఇమేజ్ ను తుడిచేసుకుని… మంచి నాయకుడు అనిపించుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయాలకు తగ్గట్లుగానే ఉంటానని… దెబ్బకు దెబ్బ కొడతానని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతున్నారు. పని చేయని పార్టీ నేతలకూ అలాంటి సంకేతాలే పంపుతున్నారు. పార్టీ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. అలాగే సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోతున్నారు. ఇదంతా యువగళం పాదయాత్రకు ఆదరణ పెరగడానికి కారణంగా భావిస్తున్నారు.