సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ముఖ్య సలహాదారు. కానీ ఆయన జగన్ రెడ్డి ని గుప్పిట్లో పెట్టుకున్నారని ఆయన ఏం చెబితే అది చేస్తారని.. డీఫ్యాక్టో సీఎం అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సీఎం జగన్ కుటుంబసభ్యులు.. ముఖ్యంగా జగన్ తల్లి కూడా … సజ్జల ద్వారానే జగన్ దగ్గర వ్యవహారాలు చక్క బెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విజయమ్మ.. బుధవారం రహస్యంగా అమరావతికి వచ్చారు. అలా వచ్చింది జగన్ ఇంటికి కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి. సజ్జల రామకృష్ణారెడ్డి అధికార విధుల్లో సీఎం క్యాంప్ ఆఫీసులో బిజీగా ఉన్న సమయంలోనే… విజయమ్మ సజ్జల ఇంటికి వెళ్లారు. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నారు. ఆమెతో కొంతసేపు మాట్లాడి వెళ్లిపోయారు. అసలు విజయమ్మకు ఇలా సజ్జల ఇంటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. పిలిస్తే చేతులు కట్టుకుని వాళ్ల ముందు నిలబడిన ఫ్యామిలీ సజ్జలది. అలాంటి పరిస్థితి నుంచి ఇంటికి వెళ్లి మరీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి… కుటుంబ విషయాల గురించి మాట్లాడాల్సిన దుస్థితి ఏర్పడింది.
విజయమ్మ ఏదైనా నేరుగా జగన్ ను అడగవచ్చు. కానీ అలా మాట్లాడలేదని దొంతరలను.. సజ్జల ఇప్పటికే ఏర్పాటు చేశారు. జగన్ పూర్తిగా సజ్జల మైకంలో ఉన్నారని.. తల్లి, చెల్లిని కూడా దూరం పెట్టడమే దానికి సాక్ష్యమంటున్నారు. ఆయన సలహాలతోనే తమ కుటుంబం విచ్చిన్నమైపోయిందని ఎక్కువ మంది నమ్ముతారు. ఇప్పుడు నేరుగా సజ్జల ఇంటికి వెళ్లిన విజయమ్మ… సజ్జల భార్యకు ఏం చెప్పారో కానీ… సజ్జల మాత్రం.. వారిని జగన్ కు మరింత దూరం చేస్తారు కానీ దగ్గర చేసే అవకాశాల్లేవని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.