విజయసాయిరెడ్డి అమరావతిలో వైసీపీ అనుబంధ సంఘాల మీటింగ్ పెట్టారు. ఇక రిలాక్స్ అయిందని చాలని. అందరూ ఇరవైనాలుగు గంటలూ పార్టీ కోసం పని చేయాలని ఆదేశించారు. విద్యార్థి, యువత, మహిళా విభాగాలతో ఆయన సమావేశం అయ్యారు. విజయసాయిరెడ్డికి అన్ని పదవులు పీకేసి..అనుబంధ సంఘాల ఇంచార్జ్ పదవి ఇచ్చారు. అయితే ఆ అనుబంధ సంఘాలకు అధ్యక్షులు అందర్నీ సజ్జల రామకృష్ణారెడ్డి కమాండ్ చేస్తూంటారు. సోషల్ మీడియాను అసలు అనుబంధంగా చూడకుండా.. సజ్జల కొడుకు చేతిలో పెట్టారు. అంతకు ముందు విజయసాయిరెడ్డి చూసేవారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలతో విజయసాయిరెడ్డి పూర్తిగా రిలాక్స్ అయ్యారు. వైవీ సుబ్బారెడ్డితో ఉత్తరాంధ్ర రాజకీయంతో పోటీ పడుతూ.. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. బయట కనిపించడం మానేశారు. బూతుల ట్వీట్లు కూడా ఆపేశారు. మళ్లీ ఆయన తన అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అయ్యాక బయటకు వస్తున్నారు. ట్వీట్లు పెడుతున్నారు. పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశమై ఇక రిలాక్స్ అయిందని చాలని సుద్దులు చెబుతున్నారు. ఇంత కాలం రిలాక్స్ అయింది మీరే కదా అని అనుబంధ సంఘాల నేతలు అనుకుని ఉంటారు.
మొత్తంగా విజయసాయిరెడ్డి తాను యాక్టివ్ అయ్యానని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బాలినేని వదిలేసిన మూడు జిల్లాల ఇంచార్జ్ పదవి ఇచ్చారని చెప్పుకుంటున్నారు కానీ.. తీసుకున్నానని కానీ.. పని చేస్తానని కానీ విజయసాయిరెడ్డి చెప్పడం లేదు. ఆయన ఏ డిమాండ్లు కోరుతున్నారో కానీ.. విజయసాయిరెడ్డి మాత్రం.. తాను పని చేయాలంటే.. కొన్ని కండిషన్స్ ఉంటాయన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.