గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో టిడ్కో ఇళ్లను నిర్మించారు. వాటిని లబ్దిదారులకు కేటాయించారు. చివరికి రోడ్లు, కరెంట్ వంటి సదుపాయాలు కల్పించి లబ్దిదారులకు హ్యాండోవర్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. నాలుగేళ్లయింది. ఆ రోడ్లు.. కరెంట్ పనులు చేయలేదు. కానీ ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ చేసేశారు. సీఎం జగన్ వచ్చి ప్రారభించడానికి ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు అంటే వారి దృష్టి లో … ఒక్కడ ఓ వైఎస్ విగ్రహం పెట్టడం… ఇళ్ల మొత్తానికి నీలి రంగులు వేయడం… ఎటు చూసినా జగన్ ఫ్లెక్సీలు కనబడేలా చేయడం. ఆ ఏర్పాట్లు పూర్తి చేశారు.
మరి ఇళ్లు ప్రారంభించాలంటే.. రోడ్లు..కరెంట్ ఉండాలి కదా అనే విషయాన్ని మార్చిపోయారు. సీఎం జగన్ ప్రారంభించడానికైనా ఆ ఏర్పాట్లు లేకపోతే లబ్దిదారులు తిట్లందుకుంటారని.. నాలుగేళ్లలో రంగులేసుకుని ఇళ్లు ఇస్తారా అని మండిపడతారన్న ఉద్దేశంతో ఆగిపోయారు. ఇటీవల అమరావతిలో చంద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. అందులోఉండేలా నీరు.. కరెంట్.. లాంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్దిదారులు ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టారు. గుడివాలో అలాంటి పరిస్థితి రాకుండా సీఎం జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం కొడాలి నాని ప్రయత్నిస్తున్నారు. ప్రతీ ఊరికి వాహనాలను ఏర్పాటు చేశారు. అయితే చివరి క్షణంలో సీఎం జగన్ పర్యటన రద్దయిందని సమాచారం వచ్చింది. దీంతో వైసీపీ నేతలంతా ఊసూరుమన్నారు. పరువుపోయిందని కొడాలి నాని ఫీలవుతున్నారు. అన్ని ఇళ్లనూ పూర్తి చేసిన తర్వాతే ప్రారంభిస్తున్నారా… తన విషయంలో ఎందుకిలా చేస్తున్నారని ఆయన వాపోతున్నట్లుగా చెబుతున్నారు.